వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు తమ్ముళ్లకు వర ప్రదాయిని ‘రైతు రథం’: ఇన్‌చార్జీ మంత్రులపై ఒత్తిళ్లు ఇలా

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: సంక్షేమ పథకాలు, రుణాలు, రాయితీలు.. ప్రజల సొమ్ముతో అమలు చేసే ఏ పథకమైనా ముందుగా అధికార పార్టీ నేతలు, కార్యకర్తల చెంతకు చేరాల్సిందే. వ్యవసాయాన్ని ఆధునీకరించాలన్నసదాలోచనతో చంద్రబాబు సర్కార్ అన్నదాతలకు సబ్సిడీపై ట్రాక్టర్లు పంపిణీ చేయాలని సంకల్పించింది. దీనికి రైతు రథం అని పేరు పెట్టింది కూడా.
కానీ రాయితీపై రైతులకు అందజేసే ట్రాక్టర్లను సొంతం చేసుకునేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. నేతల సాయంతో అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో అన్నదాతలకు ట్రాక్టర్లు అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన రైతురథం పథకం కేవలం తెలుగు తమ్ముళ్లకే దక్కుతుందా? ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తే నిజమనే అనిపించక మానదు. అర్హులకు ట్రాక్టర్లు అందే అవకాశం కనపడటం లేదు.

ఏపీ అంతా ఆరేడు వేల ట్రాక్టర్ల పంపిణీ ఇలా

ఏపీ అంతా ఆరేడు వేల ట్రాక్టర్ల పంపిణీ ఇలా

రాయితీ ట్రాక్టర్లను దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ మండల నేతలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. తమ వర్గం వారికే ఇప్పించేందుకు పైరవీలు చేస్తున్నారు. ఈ ఎంపిక బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల ఇన్ చార్జ్ మంత్రుల చేతుల్లో పెట్టడంతో ఇవి పూర్తిగా ఒక వర్గానికే దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,600 ట్రాక్టర్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తూ ఉంటే కేవలం వేల సంఖ్యలో.. జిల్లాలకు వచ్చే సరికి వందల సంఖ్యలో ట్రాక్టర్లు పంపిణీ చేయడం వల్ల ఒనగూడే ప్రయోజనమేమిటో తెలియజేయాలని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
 తక్కువ సామర్థ్యం ఉన్న యంత్రాలు పంపిణీ చేశారని విమర్శలు

తక్కువ సామర్థ్యం ఉన్న యంత్రాలు పంపిణీ చేశారని విమర్శలు

గతంలో వరికోత యంత్రాల మంజూరులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. నిర్ణయించిన సామర్ధ్యం కన్నా తక్కువ సామర్ధ్యం ఉన్న వరికోత యంత్రాలను లబ్ధిదారులకు అంటగట్టారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా వచ్చిన రైతురథం పథకం కూడా అర్హులకు అందే పరిస్థితి లేకుండా పోతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల్లో రైతు రథం పథకం కింద 520 ట్రాక్టర్లు మంజూరు చేశారు. బహిరంగ మార్కెట్‌లో ట్రాక్టర్‌ ఖరీదు 8 నుంచి 9 లక్షల మధ్య ఉంది. ప్రభుత్వం.. రూ. 2.5 లక్షల సబ్సిడీతో రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి కనీసం రైతుకు రెండు ఎకరాల పొలం ఉండాలన్న నిబంధన పెట్టింది. దీంతో కౌలు రైతులకు ఈ పథకం అందకుండా పోనున్నది.

వేలల్లో రైతులు.. వందల్లో రైతు రథాలు

వేలల్లో రైతులు.. వందల్లో రైతు రథాలు

అన్నదాతలు దరఖాస్తుతో పాటు ముందుగా రూ. 10 వేల రూపాయల డీడీని జతచేసి, మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. రెండు, మూడు ఎకరాల భూమి ఉన్న రైతుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ప్రతి ట్రాక్టర్‌కు రెండున్నర లక్షల రూపాయల సబ్సిడీ రానుండటంతో దీనిపై ప్రజాప్రతినిధుల కన్ను పడింది. పశ్చిమ గోదావరి జిల్లాకు జరిగిన కేటాయింపుల ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 34 వరకూ వస్తాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎంపికలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పాత్ర ప్రధానం కానున్నది. ప్రజాప్రతినిధులు తమవారికి వీటిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచి మంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు.

 అర్హులకు రైతు రథం పథకం అందదన్న అనుమానాలు

అర్హులకు రైతు రథం పథకం అందదన్న అనుమానాలు

వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు అర్హులకు అందడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు పొలం వైపు కన్నెత్తి చూడని వారు కూడా ఈ రాయితీ ట్రాక్టర్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాస్తవంగా సాగు చేసే రైతులకు పనిముట్లు దొరకడం లేదు. రైతులకు ట్రాక్టర్లు అందించాలనే లక్ష్యం కూడా తప్పుదోవ పట్టే పరిస్థితి కనపడుతోంది. రాష్ట్రమంతటా రైతు రథం కోసం దరఖాస్తులు తీసుకోవడం, ట్రాక్టర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావస్తున్నా మన జిల్లాలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఉన్నతాధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాతే ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తామని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ గౌసియా బేగం చెబుతున్నారు.

 తమ వారి కోసం టీడీపీ నేతల తెర వెనుక యత్నాలు

తమ వారి కోసం టీడీపీ నేతల తెర వెనుక యత్నాలు

ప్రకాశం జిల్లాకు 400 ట్రాక్టర్లు మంజూరైనట్లు వ్యవసాయాధికారులు ప్రకటించారు. వీటిని టీడీపీ ట్రాక్‌లో ఉన్న వారికి, తాము చెప్పిన రైతులకే ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ఇప్పటికే అధికారులకు హుకుం జారీ చేశారు. ప్రధాన నేతల అనుచరులు మరో అడుగు ముందుకేసి ట్రాక్టర్లు తమ వర్గీయులకు ఇవ్వాలంటూ తెరవెనక దందాలు ప్రారంభించారు. జిల్లాలోని టీడీపీ ముఖ్యనాయకులు, నియోజవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు, మండలాల నాయకులు ఇప్పటికే వారి అనుచర గణం జాబితాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రైతు రథం పథకం కింద ట్రాక్టర్‌తో పాటు వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ వస్తుంది. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.3లక్షల వరకు రాయితీ వస్తుందన్న ఉద్దేశంతో నాయకుల మధ్య పోటీ పెరిగిపోతోంది. అర్హుల జాబితాను ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కలిసి తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో నియోజకవర్గాల వారీగా జాబితాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు రూపొందిస్తున్నారు. కొంత మంది టీడీపీ నేతల అనుచరులు కమిషన్లకు తెరలేపారు.

English summary
Amaravati: The state Agriculture Minister Somireddy Chandramohan Reddy has announced that the government has decided to provide micronutrients with free of cost to the farmers in Andhra Pradesh. He stated that Due to this decision farmers will benefit about Rs120 crores. The government wanted to cut cotton cultivation by giving subsidies to farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X