వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్తగా ఇద్ద‌రు కేబినెట్‌..ఆరుగురు స‌హాయ మంత్రులు: సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీలో కొత్తగా ఇద్ద‌రు కేబినెట్‌ || AP Govt Gives Cabinet Rank For Chief Whips In Legislative Council

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కేబినెట్ మంత్రులుగా అవ‌కాశం ద‌క్క‌ని వారికి ప్రత్యామ్నాయంగా వారికి మంత్రి హోదా ద‌క్కిస్తూ ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుండి గెల‌వ‌టంతో అనేక మంది నేత‌లు త‌మ‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో స్థానం ద‌క్కుతుంద‌ని ఆశించారు. అయితే ప‌క్క‌గా త‌న కేబినెట్ కూర్పులో ప్రాంతీయ - సామా జిక స‌మీక‌ర‌ణాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. ఏకంగా అయిదుగురికి ఉప ముఖ్య‌మంత్రి హోదా కల్పించారు. అనేక మంది సీనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేదు.ఇదే స‌మ‌యంలో తొలి నుండి జ‌గ‌న్‌తోనే ఉన్న ప‌లువురు నేత‌ల‌ను జ‌గ‌న్ బుజ్జ‌గించి వారికి ప్ర‌త్యామ్నాయ ప‌దవుల‌తో సంతృప్తి ప‌ర‌చాల్సి వ‌చ్చింది. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా ఇద్ద‌రికి కేబినెట్ మంత్రి..ఆరుగురికి స‌హాయ మంత్రుల హోదా ద‌క్క‌నుంది.

ఇద్ద‌రికి కేబినెట్ హోదా...

కేబినెట్‌లో మొత్తం 25 మందికి అవ‌కాశం ఉండ‌గా..జ‌గ‌న్ మొత్తం బెర్తుల‌ను భ‌ర్తీ చేసారు. దీంతో..మిగిలిన సీనియ‌ర్ల‌ను సంతృప్తి ప‌ర్చ‌టానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఆరుగురికి విప్‌లుగా అవ‌కాశం ఇచ్చారు. సాధార‌ణంగా చీఫ్ విప్‌కు కేబినెట్ హోదా ఉంటుంది. ఇప్పుడు తిరిగి ఏపీ శాస‌న మండ‌లి..శాస‌న స‌భ‌లో చీఫ్ విప్‌లుగా ఉన్న ఉమ్మారెడ్డి వేంక‌టేశ్వ‌ర్లు..శ్రీకాంత రెడ్డిల‌కు కేబినెట్ హోదా క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. వీరితో పాటుగా మ‌రో ఆరుగురు విప్‌లుకు చ‌ట్టంలో ఉన్న వెసులుబాటును ఉప‌యోగించుకుంటూ స‌హాయ మంత్రులుగా హోదా క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో విప్‌లుగా ఉన్న వారికి ప్ర‌త్యేకంగా ఎటువంటి హోదా క‌ల్పించ‌లేదు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌కు ఉన్న అవ‌కాశం మేర‌కు.. విప్‌లుగా ఉన్న వారికి సైతం ప్ర‌భుత్వంలో హోదా క‌ల్పించాలని నిర్ణ‌యించింది.

AP Govt given cabinet rank for Chief Whips in legislative council and Assembly. Deputy minister rank for Whips.

స‌హాయ మంత్రులుగా ఆరుగురికి..
చీఫ్ విప్‌లకు కేబినెట్ హోదా క‌ల్పించిన ప్ర‌భుత్వం విప్‌లుగా ఉన్న వారికి స‌హాయ మంత్రుల హోదా క‌ల్పించింది. ప్ర‌స్తుతం విప్‌లుగా ఉన్న చెవిరెడ్డి భాస్క‌ర రెడ్డి.. సామినేని ఉద‌య‌భాను.. కాపు రామ‌చంద్రారెడ్డి.. కొరుముట్ల శ్రీనివాసు లు..పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి.. ముత్యాల నాయుడు.. దాడిశెట్టి రాజాకు స‌హాయ మంత్రి హోదా క‌ల్పిస్తూ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే, దీని పైన న్యాయ‌ప‌రమైన అభ్యంత‌రాలు ఉండే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. ప్ర‌భుత్వం ఆరుగురికి స‌హాయ మంత్రుల హోదా క‌ల్పించ‌టంతో వారిని రాజ‌కీయంగా సంతృప్తి ప‌ర్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇప్పుడు ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం పైన అటు పార్టీలోనూ..ఇటు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ మొద‌లైంది. అయితే, తాము కేబినెట్‌లో మంత్రులుగా కాక‌పోయినా.. హోదా అయినా ద‌క్కినందుకు విప్‌లు సంతృప్తి ప‌డుతున్నారు.

English summary
AP Govt given cabinet rank for Chief Whips in legislative council and Assembly. Deputy minister rank for Whips. With this decision those leaders feeling satisfaction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X