వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదానీ సెజ్‌లో గంగవరం పోర్టు విలీనం... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం...

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్‌ను(జీపీఎల్) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్‌ లిమిటెడ్(ఏపీసెజ్)లో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విలీన ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గంగవరం పోర్టును డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ది చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.1 శాతం, విండీ లేక్ ‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌కు 31.15 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటా ఉంది. రాజు, విండీ లేక్ సైడ్ వాటాలను అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ సెజ్) కొనుగోలు చేసింది. డీవీఎస్ రాజుకు కన్సార్టియంకు చెందిన వాటాను రూ.3604 కోట్లకు,విండీ లేక్ సైడ్ వాటాను రూ.1954 కోట్లకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది.

 ap govt gives nod to merge vizag gangavaram port into adani ports

మిగిలిన ప్రభుత్వ వాటాను కూడా కొనుగోలు చేసి పోర్టును పూర్తిగా తమ ఆధీనం చేసుకోవాలని ఏపీసెజ్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అటువైపు నుంచి సానుకూల స్పందన వచ్చింది. ప్రభుత్వ వాటాల విక్రయానికి సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు కార్యదర్శులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తాజా ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ పోర్ట్ డెవలపర్,ఆపరేటర్‌గా ఉన్న అదానీ గ్రూప్... గంగవరం పోర్టు కొనుగోలు ద్వారా పాన్-ఇండియాలో తమ కార్గో ఉనికిని మరింత విస్తరించనుంది. గంగవరం పోర్టు వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్‌లోనైనా ఇక్కడినుంచి సరకు రవాణాకు అవకాశం ఉంటుంది. బాగా లోతైన పోర్టు కావటంతో 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్‌ కేప్‌ సైజ్‌ ఓడలు కూడా ఇక్క‌డికి వచ్చి వెళ్ల‌గ‌లవు.

దాదాపు 1800 ఎకరాల విస్తీర్ణంలోని గంగవరం పోర్టులో మొత్తం 9 బెర్తులు ఉన్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు/ దిగుమతులు ఇక్కడినుంచి పెద్దఎత్తున సాగుతున్నాయి.

Recommended Video

RGV ట్వీట్ల పరంపర, Allu Sirish పై సెటైర్, Anandayya కి Nobel ఇవ్వాలంటూ || Oneindia Telugu

English summary
Andhra Pradesh government given nod to merge gangavaram port into Adani ports special economic zone limited.Gautam Adani-led Adani Ports and Special Economic Zone (APSEZ) Ltd on acquired almost 90 percent stake in Gangavaram port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X