క్రిస్మస్ వేళ చంద్రబాబు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో డబ్బులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అన్ని వర్గాల వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. ముఖ్యంగా ఏపీలో అన్ని మతాలకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రస్తుతం క్రిస్మస్ వేడుకల నేపధ్యంలో క్రిస్టియన్లకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. క్రిస్మస్ పండుగకు ముఖ్యంగా పాస్టర్ లకు శుభవార్త అందించింది.

పాస్టర్ ల గౌరవ వేతనం విడుదల చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలోని పాస్టర్లకు నెలవారీగా అందించే గౌరవ వేతనాల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు గౌరవ వేతనాల విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పాస్టర్ లకు గౌరవ వేతనం అందించారు. సెమీ క్రిస్మస్ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగానే, డిసెంబర్ 24వ తేదీ సాయంత్రం లోపే గౌరవ వేతనాలు చెల్లించామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

AP Govt Good news on christmas Releases Rs 50 50 Crore for Pastors

రూ.50.50 కోట్లకు పైగా నిధుల విడుదల
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,418 మంది పాస్టర్లకు గౌరవ వేతనాల కోసం రూ.50.50 కోట్లకు పైగా నిధులను నేడు విడుదల చేశారు. ఈ నిధులు నేరుగా పాస్టర్ల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. 2024 డిసెంబర్ నెల నుంచి 2025 నవంబర్ వరకు మొత్తం 12 నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలను నేడు ఒకేసారి ప్రభుత్వం చెల్లించింది.

పాస్టర్ కు నెలకు 5వేల చొప్పున, సంవత్సరానికి 60వేలు
ఈ పథకం కింద ఒక్కో పాస్టర్‌కు నెలకు రూ.5,000 చొప్పున, వార్షికంగా రూ.60,000 అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు విడుదల కావడంతో పాస్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి పండుగకు ముందు ఇది వారికి గిఫ్ట్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.. క్రిస్మస్ పండుగకు ముందే ఈ నిధులు జమ కావడం పాస్టర్లకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.

పాస్టర్ లలో సంతోషం
మత సేవలు చేస్తున్న పాస్టర్లకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ గౌరవ వేతనాల లక్ష్యమని ఏపీ లోని కూటమి ప్రభుత్వం తెలిపింది. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ చర్య మరోసారి స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిస్మస్ పండుగ వేళ పాస్టర్లకు ప్రభుత్వం అందించిన ఈ కానుక పాస్టర్ ల సంతోషానికి కారణం అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+