మాజీ సీఎస్ విజయానంద్ కు కీలక బాధ్యతలు, సీఎంఓ లో సహా..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఎస్ గా బాధ్యతలు నిర్వహించిన విజయానంద్ పదవీ విరమణ చేసారు. కాగా, విజయానంద్ సేవలు భవిష్యత్ లోనూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసారు. ఏకంగా మూడు బాధ్యతలను విజయానంద్ కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. సీఎంఓ తో సహా విద్యుత్ శాఖ బాధ్యత లను అప్పగించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన విజయానంద్ కు తిరిగి కీలక పదవులు దక్కాయి. ఈ రోజు విజయానంద్ కు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ బాధ్యత లు స్వీకరించారు. ఆ వెంటనే విజయానంద్ కొత్త బాధ్యతల పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆయన చూసిన విద్యుత్ శాఖనే అప్పగిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా నియమించుకున్నారు. దీంతో విజయానంద్ ఏడాది పాటు ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా, ఏపీట్రాన్స్కో సీఎండీ గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏడాది పాటు అయన ఈ పదవిలో కొనసాగుతారు అని ప్రభుత్వం శనివారం నాడు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యుత్ శాఖ విషయంలో ఇక ఆయన ఎవరికీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండకుండా ముఖ్యమంత్రి ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా నియమించారు.

కీలక బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ
అదే విధంగా సీఎంఓ లో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను పూర్తి స్థాయిలో టీటీడీ ఈఓ గా నియమించారు. నూతన సిఎస్ గా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్ కే జలవనరుల శాఖ, రెవెన్యూ శాఖల పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. సాయి ప్రసాద్ సీఎస్ గా బాధ్యతల స్వీకరణ వేళ తిరుమల తిరుపతి దేవస్థానం మరియు విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాల వేద పండితుల ఆశ్వీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉ.11.33 గం.లకు సిఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ పలు జిల్లాలకు కలెక్టర్ గా.. ప్రభుత్వంలో అనేక కీలక శాఖల్లో ముఖ్య హోదాల్లో పని చేసారు. కాగా.. ఇప్పుడు విజయానంద్ కు కీలకమైన బాధ్యతల కేటాయింపు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications