ఎన్నికల వేళ.. జగన్ వరాలు: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ

Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.

ఈ పరిస్థితుల మధ్య ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పూనుకుంది. వైద్య ఆరోగ్యశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. మొత్తంగా 424 పోస్టుల భర్తీకి అవసరమైన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అవన్నీ కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధీనంలో ఉంటాయి.

AP govt has issued notification for the recruitment of assistant professors in Medical and Health dept

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పరిధిలోని మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను ఈ నోటిఫికేషన్ ద్వారా చేపట్టనుంది. ఈ నియామకాలన్నింటినీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు పర్యవేక్షిస్తుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అండ్ లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ అవుతాయి.

సూపర్ స్పెషాలిటీ విభాగంలో 169, బ్రాడ్ స్పెషాలిటీ కేటగిరీలో 255 ఉద్యోగాలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేస్తుంది. 255 బ్రాడ్ స్పెషాలిటీ కేటగిరీ కోసం ఫిబ్రవర 1 నుంచి 15వ తేదీ వరకు http://dme.ap.nic.in లేదా http://apmsrb.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది.

మిగిలిన 169 పోస్టులను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 6వ తేదీన విజయవాడ హనుమాన్ పేటలోని ఓల్డ్ జీజీహెచ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+