భూముల ధరల పై ప్రభుత్వం తాజా నిర్ణయం - బారులు తీరిన జనం..!!

ఏపీలో భూముల ధరల మార్కెట్ విలువ పెంపు పైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. జనవరి 1 నుంచి పెంపు దిశగా ప్రభుత్వం తొలుత కసరత్తు చేసింది. అయితే, స్థానికంగా వస్తున్న ఫీడ్ బ్యాక్ తో పునరాలోచనలో ఉంది. ఈ నెల 30న ప్రభుత్వం ఈ అంశం పైన కీలక సమావేశం ఏర్పా టు చేసింది. ఇటు భూముల మార్కెట్ విలువ పెరుగుతుందనే అంచనాలతో రిజిస్ట్రార్ కార్యాల యాల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

ధరల పెంపు పై
రాష్ట్రంలో భూముల మార్కెట్‌ ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్కారు ఏం చేయబోతోంది అనేది కీలకంగా మారుతోంది. జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలు పెరుగుతాయనే సమాచారం తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్టార్ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరారు. గతం కంటే రెట్టిం పు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే, ఇటు ప్రభుత్వం మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. జనవరి 1 నుంచి పెంచాలనే నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడినట్లు సమాచారం. ఈ నెల 30 న జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో ఈ అంశం పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

AP Govt hold the decision over land rates hike to continue more negotiations as reports

జనం బారులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో మార్కెట్‌ ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు నివేదిక సమర్పించారు. ఏటా 14వేల కోట్ల రెవెన్యూ చూపించేలా ప్రతిపాదనలు చేశారు. ఇది అమలైతే ఒక్క రిజిస్ట్రేషన్ల ద్వారానే ఏటా 14వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆర్దిక శాఖ ఆశలు పెంచుకుంది. ఈ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ఆర్దిక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2025 జనవరి 1 నుంచే భూముల మార్కెట్‌ ధరలు పెంచాలని తొలుత నిర్ణయించింది.

30న తుది నిర్ణయం
కానీ, ఈ నిర్ణయం పైన ప్రజల్లో ఆందోళన నెలకొన్నట్లుగా ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇక, ప్రభుత్వం ధరలు పెంచటం ఖాయమనే భావనతో ఈ నెలాఖరులో గా క్రయ విక్రయాలు పూర్తి చేసేందుకు ప్రజలు రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఒకటో తేదీ లోగానే తమ లావా దేవీలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే, ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుందామని, జనవరి 1 నుంచి భూముల మార్కెట్‌ ధరల పెంపు నిర్ణయం అమలును వాయిదావేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఆదేశాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+