అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉపాధ్యాయుల బదిలీలు - ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయులు కొంత కాలంగా ఎదురు చూస్తున్న బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు పూర్తి విధి విధానాలు - షెడ్యూల్ ను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సంక్రాంతి ముందు ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

బదిలీల విధి విధానాలు విడుదల

బదిలీల విధి విధానాలు విడుదల


ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 విద్యా సంవత్సరం నాటికి ఒకే పాఠశాలలో అయిదేళ్ల సర్వీసును పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు.. ఎనిమిది విద్యా సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి చేసింది. 2024 ఆగస్టు 31 లేదా రెండేళ్లలోగా పదవీ విరమణ చేసే వారు కోరుకుంటే మినహా బదిలీ చేయరు. బదిలీ దరఖాస్తుకు ఎలాంటి సర్వీసు నిబంధన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022 ఆగస్టు 31 నాటికి 50 ఏళ్ల లోపు వయసు ఉణ్న బాలిక హై స్కూళ్లోని పురుష హెచ్ఎ్ టీచర్లకు బదిలీ తప్పనిసరి చేసారు.

ఆన్‌లైన్‌లో వెబ్‌కౌన్సిలింగ్‌ ద్వారా

ఆన్‌లైన్‌లో వెబ్‌కౌన్సిలింగ్‌ ద్వారా


ఆన్‌లైన్‌లో వెబ్‌కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియ ఉంటుంది. కటాఫ్‌ తేదిగా 2022 ఆగస్టు 31గా ప్రభుత్వం పేర్కొంది. ఎలాంటి సర్వీస్‌ లేకపోయినా (సున్నా సర్వీస్‌) బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం మొదటి సారి కల్పించింది. 2024 ఆగస్టు 31లోపు పదవి విరమణ పొందే ఉపాధ్యాయులు కోరుకుంటనే బదిలీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2021లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. బదిలీల ప్రక్రియ మొత్తం 30 రోజుల్లో పూర్తికానుంది. ఈ నెల 12, 13 తేదిల్లో యాజమాన్యాలు వారీగా, సబ్జెక్టు, మీడియం వారీగా ఖాళీలను పాఠశాల విద్యాశాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది.

సంక్రాంతి లోగా ప్రక్రియ పూర్తి

సంక్రాంతి లోగా ప్రక్రియ పూర్తి


14 నుంచి 17వ తేది వరకు ఉపాధ్యాయులు బదిలీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 18,19 తేదిల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తారు. 20,21,22 తేదిల్లో సీనియార్టీ లిస్ట్‌ వెబ్‌సైట్‌లో ఉంటుంది. 23,24 తేదిల్లో వీటిపై అభ్యంతరాలు తెలుపవచ్చు. 26వ తేదిన సీనియార్టీ తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 27 నుంచి జనవరి 1వ తేది వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ప్లేస్‌లు కేటాయించిన తుది జాబితాను జనవరి 2 నుంచి 10వ తేది వరకు వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఈ జాబితాపై ఏదైనా ఫిర్యాదులు వస్తే 11వ తేదిన పరిశీలిస్తారు. 12వ తేదిన బదిలీల ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. మున్సిపల్‌, గిరిజన ఉపాధ్యాయులకు బదిలీల షెడ్యూల్‌ విడిగా ఉంటుందని పేర్కొన్నారు.

English summary
AP Govt issues teachers Transfers gudie lines and Councilling Schedule, process to be complete by january 12th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X