సచివాలయాల ఉద్యోగులు ఇక నుంచి, ప్రభుత్వం కీలక ఆదేశాలు - తప్పనిసరి..!!

ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. సచివాలయాల సంస్కరణలో భాగంగా ఉద్యోగుల విషయం లో మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో సచివాలయాల సిబ్బంది హాజరు.. సమయ పాలన పైన వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేసారు. ఈ మేరకు ఇప్పుడు జిల్లా అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో.. ఇక నుంచి సచివాలయ ఉద్యోగులు ఈ ఆదేశాల మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వం సచివాలయాల ఉద్యోగుల పై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల హాజరుపై దృష్టి సారించింది. అందుకుగాను క్షేత్రస్థాయి నుంచి సిబ్బంది సమాచారాన్ని సేకరించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇక తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అధికారులు చెప్పారని అనధికార డిప్యుటేషన్లపై ఇతర కార్యాలయాల్లో పని చేయడం క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడం ఇకపై కుదరదని తేల్చి చెప్పింది. నిర్దేశించిన సమయంలోగా యాప్‌లో రోజూ హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసింది. రీ సర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు తప్ప మిగిలిన వారెవరికీ మినహాయింపు లేదు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం తప్పనిసరి అనుకుంటే అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తూ రాష్ట్ర సచివాలయాల శాఖ ఈ మేరకు చర్యలను చేపట్టింది.

ap-govt-issues-key-directions-for-officials-over-secretariat-staff-attendance

ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గ్రామ, వార్డు సచివాలయాల పని తీరు పై జరిగిన చర్చలో సిబ్బంది తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయా ల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న సమాచారంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అనధికార డిప్యుటేష న్లపై ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. వీటిని గుర్తించిన సచివాలయాల శాఖ రద్దు చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన, పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడానికి చెక్‌ పెట్టింది. నిర్దేశించిన సమయంలోగా యాప్‌లో హాజరును తప్పనిసరి చేసింది. రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లు తప్పితే మిగిలిన సిబ్బంది విధిగా సచివాలయాలల్లో పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సర్వేయర్లలోనూ అందరికీ మినహాయింపు లేదు. జాయింట్‌ కలెక్టర్‌ సూచించిన వారికే వెసులుబాటు ఉంది. వీరు కూడా రీసర్వే చేస్తున్న ప్రాంతంలో యాప్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇందు కోసం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+