పెన్షన్ల పంపిణీపై తాజా మార్గదర్శకాలు - వారికి బ్యాంకుల్లోనే..!!

ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ 4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ల వ్యవస్థ తో కాకుండా..సచివాలయ సిబ్బందితోనే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా, పెన్షన్ల పంపిణీకి సంబంధించి కాల పరిమితితో సహా మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

పెన్షన్ పంపిణీ
ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకార, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టే వృత్తివారు, ట్రాన్స్‌జెండర్లు, ఏఆర్‌టీ, డప్పు కళాకారులు, ఆర్టిస్టు పెన్షన్‌దారులకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచారు. దివ్యాంగులు, కుష్టురోగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచారు. పూర్తి వైకల్యం ఉన్న వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, లివర్‌, గుండె ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నవారు, డయాలసిస్‌ రోగులు తదితరులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు.

AP Govt issues latest guide lines for Ward Secretariats overs Pensions distribution in next month

మార్గదర్శకాలు జారీ
పెంచిన పెన్షన్‌ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుంది. జూలై 1న ఒక్కో పెన్షన్‌దారుడు రూ.7 వేలు పొందే అవకాశం ఉంది. అనంతరం ప్రతి నెలా రూ.4 వేల పెన్షన్‌ అందుకోనున్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికెళ్లి పంపిణీ చేస్తారు. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేస్తారని, కలెక్టర్లు, అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు..జిల్లా మంత్రులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. గతంలో వాలంటీర్ల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా..ఇప్పుడు సచివాలయ సబ్బంది పంపిణీ చేయనున్నారు.

సచివాలయాలకు బాధ్యతలు
ప్రతీ సచివాలయ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని స్పష్టం చేసారు. మిగిలిన వారికి రెండో అందించాలని సూచించారు. ఎప్పటి లాగానే హెచ్ఐవీ బాధితులకు, ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్ధులకు బ్యాంకు ఖాతాల్లోనే ఫింఛను మొత్తాన్ని జమ చేయాలని నిర్దేశించారు. మొత్తంగా రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తి కావాలని పేర్కొన్నారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు నిరంతరం పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+