రేపు సెలవు పొడిగింపు - ప్రభుత్వం ఉత్తర్వులు..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రోజు సెలవు పొడిగించారు. ఉగాది, రంజాన్ సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. తాజాగా, రేపు (మంగళవారం) సైతం సెలవు ప్రకటించారు. ఏపీలో ఏప్రిల్ 1న ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వు లు జారీ చేసారు. వక్ఫ్ బోర్డు సీఈవో అధికారి ఇచ్చిన నివేదిక మేరకు మంగళవారం ఐచ్ఛిక సెలవు గా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంస్థలకు సెలవు కొనసాగనుంది.
వరుస సెలవులు మరో రోజు పొడిగించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ వేళ శుభవార్తను ప్రకటించింది. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ నేపథ్యంగా వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చి 31వ తేదీన ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను జరుపుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ళాశాలలు, ఆఫీస్‌లకు సెలవు ప్రకటించారు. కాగా, రేపు ఏప్రిల్ 1వ తేదీన కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

ఏపీలో ఏప్రిల్ 1 ఆప్షనల్ సెలవుగా ప్రకటించారు. వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నివేదిక ప్రకారం.. ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) తర్వాత రోజు ఏప్రిల్ 1ను ఐచ్ఛిక సెలవుగా ప్రకటించారు. ఇక, ఏపీలో ఆర్దిక సంవత్సరం ముగింపు కావటంతో ఈ నెల 30,31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాల యాలకు సెలవు రద్దు చేసారు. చివరి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేసారు. దీనికి అనుగుణంగా ఈ శాఖలో పని చేసే ఉద్యోగులు విధుల్లో ఉండాలని.. మరో సందర్భంగా ఈ రెండు రోజులు విధులు నిర్వహించినందుకు ప్రత్యామ్నాయంగా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications