మందుబాబులకు బిగ్ అలర్ట్, మద్యం అక్కడే పరిమితం- తాజా మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం మందుబాబుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం పాలసీలో మార్పులు చేసింది. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవటంతో పాటుగా రూ 99 కే క్వార్టర్ అమ్మకాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం కొత్త బార్ల పాలసీ అమలుకు సిద్దమైంది. ఇదే సమయంలో వైన్ షాపుల వద్ద మద్యం తీసుకునే విషయంలో అనేక తర్జన భర్జనల తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయం
ఏపీ ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్స్ పైన ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం విధానం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం పర్మిట్ రూమ్స్ కు తొలుత అనుమతి ఇవ్వలేదు. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలతో తాజాగా ఈ ప్రతిపాదనకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీని కారణంగా బహిరంగ మద్యపానానికి చెక్‌ పెట్టే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇక బహిరంగంగా మద్యపానం పైన ఆంక్షలు విధించనుంది. ఇక, మద్యం షాపుల్లో పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పర్మిట్‌ రూమ్‌ అంటే మద్యం షాపు పక్కనే మందు తాగేందుకు అవకాశం కల్పిస్తూ ఒక గది ఏర్పాటు చేస్తారు.

AP Govt issues orders for Permit rooms in wine shops with latest guide lines

నిర్వహణ ఇలా
కాగా, పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇచ్చినా బార్‌ తరహాలో కుర్చీలు, బల్లలు అందులో ఉండవు. గతేడాది అక్టోబరు లో ప్రైవేటు మద్యం షాపుల పాలసీ అమల్లోకి వచ్చి నప్పుడు పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బహిరంగ మద్యపానం పెరిగింది. రోడ్లపై, ఫుట్‌పా త్‌లపై, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం అలవాటుగా మారింది. గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడా ది జూన్‌ వరకు బహిరంగ మద్యపానంపై 2,77,549 కేసులు నమోదయ్యాయి. ఇది తాగేవారితో పాటు సామాన్య ప్రజలకూ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ అంశంపై పునఃసమీక్షించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రెండు విభాగాల్లో పర్మిట్‌ రూమ్‌ లకు లైసెన్స్‌ ఫీజు నిర్ణయించారు.

నిబంధనలు
ఇదే సమయంలో ఫీజులను వెల్లడించారు. రూ.55లక్షల వరకు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (వార్షిక లైసెన్స్‌ ఫీజు) ఉన్న షాపు లు రూ.5లక్షలు, రూ.65 లక్షల నుంచి రూ.85లక్షల వరకు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ఉన్న షాపులు రూ.7.5 లక్షలు పర్మిట్‌ రూమ్‌కు విడిగా లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం లైసెన్సీలు ఎక్సైజ్‌ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. వెయ్యి చదరపు అడుగులు దాటకుండా పర్మిట్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో కిచెన్‌ ఉండకూడదని స్పష్టం చేసారు. కానీ.. సిద్ధంగా ఉంచిన స్నాక్స్‌ అమ్మవచ్చు. పర్మిట్‌ రూమ్‌లలో తాగేవారికి విడిగా మద్యం సర్వ్‌ చేయకూడదని నిబంధన విధించారు. సీసాలు కొనుక్కుని వచ్చి మాత్రమే అక్కడ తాగాలి. మద్యం షాపుల పనివేళల్లో మాత్రమే పర్మిట్‌ రూమ్‌లు తెరిచి ఉంచాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+