వారి భూముల క్రమబద్దీకరణ - అర్హతలు, మార్గదర్శకాలు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం 2025 పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. 2019 అక్టోబర్ 15 తేదీని కట్ ఆఫ్ డేట్‌గా ప్రకటి స్తూ .. 150 గజాల వరకు ఉచితంగా పేర్కొంది. రిజిస్ట్రేషన్ సైతం ఫ్రీగా వెల్లడించింది. ఆ పైన ఉన్న భూముల పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
భూముల క్రమబద్దీకరణ
ఏపీలో ఆక్రమిత భూముల క్రమబద్దీకరణ పైన ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యం తరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు జారీ చేసింది. 2019 అక్టోబర్ 15 తేదీని కట్ ఆఫ్ డేట్‌గా ప్రభుత్వం పేర్కొంది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటేనే క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకొనేందుకు అర్హత ఉంటుందని స్పష్టం చేసింది. 150 గజాల వరకూ ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయనున్నట్టు వెల్లడించింది.

మార్గదర్శకాలు
ఖాళీ స్థలాలు, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్నా క్రమబద్ధీకరణకు అనర్హులని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. 301 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరణ చేసేందుకు అవకాశం కల్పించింది. మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో నిర్దేశిత స్థలాలు, లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలు (బీపీఎల్) ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు, గుడిసెలు వేసుకొని ఉంటే అందులో 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఇందు కోసం ఈ ఏడాది డి సెంబరు 31 వరకు గ్రామ,వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఉత్తర్వులు జారీ
దరఖాస్తులపై గ్రామ వీఆర్‌వో, వార్డు అధికారులు విచారణ జరిపి ఆయా ప్రాంతాలను బట్టి తహసిల్దార్, ఆర్‌డీవో, మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు. వాటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికపై ఆదేశాలు ఇస్తారు. వాటి ఆధారంగా తహసిల్దార్ కన్వేయెన్స్ డీడ్‌ల రూపంలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇస్తారు. రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు ఇస్తారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వారికీ ఇప్పుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించాల్సిన వారికి వెసులు బాటు కలిగిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు.












Click it and Unblock the Notifications