తగ్గేదే లే...అంటున్న మంత్రి సురేష్ : పరీక్షల విషయంలో ఎందుకీ పట్టుదల : ఎవరి మెప్పు కోసం..!
ఏపీలో పరీక్షల విషయంలో ప్రభుత్వం పట్టుదలకు పోతున్నట్లుగా కనిపిస్తోంది. అనేక రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసాయి. తెలంగాణలో ఎటువంటి చర్చ లేకుండా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి..ఇంటర్ రెండో సంవత్సరం వాయిదా వేసారు. ఇప్పుడు అవి కూడా రద్దు ప్రతిపాదన పైన చర్చ నడుస్తోంది. కేంద్రం సైతం సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసింది. స్వయంగా ప్రధాని ఈ అంశం పైన సమీక్ష నిర్వహించి ....విద్యార్దుల ఆరోగ్యాన్ని..ప్రస్తుత పరిస్థితులను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం ప్రకటించింది. ఇక, పలు రాష్ట్రాలు ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరో వైపు టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ దీనినే ముఖ్యమంత్రి పైన రాజకీయ అస్త్రంగా మలచుకున్నారు. పలు చర్చలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వాదన మరోలా ఉంది.
పదో తరగతి..ఇంటర్ పరీక్షలు వాయిదా వేయటానికి తమకు అభ్యంతరం లేదని చెబుతూనే తమ ఉద్దేశాన్ని వివరించారు. టెన్త్...ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేస్తే మంచి కాలేజీల్లో సీట్లు రావాని..భవిష్యత్ లోనూ విద్యార్ధులు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. తల్లితండ్రులు కోరితే తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వ వాదనగా ఉంది. ఇక, ఈ రోజు మంత్రి సురేష్ టెన్త్..ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని గట్టిగా చెప్పారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత పరీక్షలు నిర్వహిస్తామని...రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలే దీనిని వివాదం చేస్తున్నాయని మండిపడ్డారు. మరో వైపు కోర్టులో ఇదే అంశం పైన దాఖలైన పిటీషన్ల విచారణ సమయంలో ప్రభుత్వం వరుసగా టెన్త్..ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కోర్టుకు నివేదించింది. జూలైలో పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు స్పష్టం చేసింది.

అయితే, ఇలా వాయిదా వేసుకుంటూ పోవటం...ఎప్పుడు నిర్వహిస్తారో క్లారిటీ లేకపోవటంతో అటు విద్యార్ధులు..ఇటు వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. పరీక్షల కోసం ఎంత కాలం ప్రిపేర్ అవుతూ ఉండాలనే ప్రశ్న వారి నుండి ఎదురవుతోంది. ఇలా చదువుతూనే ఉండాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీచర్లు సైతం కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం..ఇతర రాష్ట్రాలకు లేని అభ్యంతరం కేవలం ఏపీకి మాత్రమే ఎందుకు ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు థర్డ్ వేవ్ గురించి భిన్న వాదనలు..హెచ్చరికలు వస్తున్నాయి. అయితే, విద్యార్ధుల భవిష్యత్.. ఆరోగ్యం తో ముడిపడిన అంశం కావటంతో ప్రభుత్వం దీని పైన ఇంతలా పట్టుదలకు పోతూ..సాగదీయటం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మంత్రులు సీఎం మెప్పు కోసం మాట్లాడుతున్నారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే, చివరకు ఈ నిర్ణయాలు ఇమేజ్ పెంచినా..డామేజ్ జరిగినా ఆ మొత్తం ముఖ్యమంత్రి ఖాతాలోనే పడుతుంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications