పేదలకు ఇళ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం - రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు..!!
ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన వారికి ఇళ్ల మంజూరు కు వీలుగా అధికారులకు కీలక సూచనలు చేసింది. అదనపు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఆసక్తి, అర్హత కలిగిన వారికి ఇళ్లను మంజూరు చేస్తోంది. అర్హతలు.. విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో, పేదలకు ఇళ్లు దక్కించుకునేందుకు మార్గం సుగమం అవుతోంది.
పేదలకు సొంతింటి కల ఫలించేలా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన వారికి ఇళ్లు మంజూరు చేయడానికి వీలుగా దరఖాస్తు గడువును మరింత పొడిగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. దీనికి తొలుత కేంద్రం ఈనెల 5 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు నెలాఖరు వరకు పొడిగించింది. తద్వారా మరో మూడు వారాలపాటు దరఖాస్తుకు అవకాశం ఉంది. దీనివల్ల మరింత మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో రాష్ట్ర - కేంద్ర ప్రభుత్వం కలిపి రూ 2.89 లక్షల వరకు ఇస్తున్నాయి.

ఈ మొత్తంలో ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ నిధులు కలిపి ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కేవలం రూ. 1.59 లక్షలు మాత్రమే వస్తుంది. కాగా, పీఎంఏవై ద్వారా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోడానికి సిద్ధంగా ఉన్నవారి వివరాలను యాప్‌లో నమోదు చేయిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం గడువు పెంచడంతో అర్హులైన వారందరికీ మేలు జరుగనుంది. అర్హత కలిగి ఉన్న ఎవ రన్నా పీఎంఏవైను సద్వినియోగం చేసుకోవచ్చని ..అందుకు ఎలాంటి పరిమితులు లేవని అధికా రులు స్పస్టం చేస్తున్నారు. దరఖాస్తులను గృహ నిర్మాణ సంస్థ, సచివాలయాల్లో అందించేందుకు అవకాశం కల్పించారు. ఇళ్లు లేని పేదలు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను కలిసి అధికారిక వెబ్‌సైట్ pmay-g ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అదే సమయంలో సొంత స్థలంలో ఇంటి పట్టా తీసుకుని ఉండాలి. లేదంటే ఈనెలాఖరులోపు అందించేలా ఉండాలి. నివాస స్థలంలో లబ్ధిదారు ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. ఇళ్లు లేనట్లు, ఉన్నట్లయితే పాడైపోయిన ఇంటి ఫొటో జత చేయాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. కాగా, బ్యాంక్ ఖాతా నంబర్, పేరు నమోదు. నరేగా జాబ్ కార్డు నంబరు వివరాలు అందించాలి. ఆధార్ నంబర్‌ను ఉపయోగించే అధికారం ఇవ్వడానికి సమ్మతి పత్రం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పీఎంఏవై ఐడీ, ప్రాధాన్యత ఎంపికను ఉపయోగించాలి. ఈ ప్రకియను ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా పూర్తి చేసుకునే సౌలభ్యం కల్పించారు. దీని ద్వారా ఎక్కువ మందికి లబ్ది చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications