జగన్ ముద్ర లేకుండా - ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!
ఏపీలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరణ చేసింది. ఆయా ప్రాజెక్టులకు వాస్తవ పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సహా కొందరి వైసీపీ నేతల పేర్లు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో జగన్ ప్రభుత్వం పెట్టింది. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12 ప్రాజెక్టు పేర్లు పునరుద్దరించారు.
ప్రభుత్వ తాజా నిర్ణయం
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగించిన పథకాలను కొనసాగిస్తూనే పేర్లను మార్పు చేసింది. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు ఖరారు చేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. అమ్మఒడిని అమ్మకు వందనంగా ఖరారు చేసారు. మధ్నాహ్నం బడి పిల్లలకు అందించే భోజనం పేరును డొక్కా సీతమ్మ మధ్నాహ్న భోజన పథకంగా మార్పు చేసారు. జగన్ మార్క్ లేకుండా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పేర్ల మార్పుతో
తాజాగా విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాన్యుమెంటల్‌పై ఉన్న జగన్పేరును తొలిగించారు. జగన్ పేరును నగర పాలక సిబ్బంది తొలిగించింది. పోలీసుల సమక్షంలోనే లైట్లు ఆర్పి జగన్ పేరు తొలగించడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 2024లో అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రారంభించారు. రూ. 400 కోట్లతో 125 అడుగుల విగ్రహాన్ని గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దగా ఏర్పాటు చేసుకోవటంతోనే తొలిగించారంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రాజెక్టులకు పాత పేర్లు
ఇక, ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు అసలు పేర్లను పునరుద్ధరిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గతంలో వైసిపి ప్రభుత్వం వైఎస్‌ఆర్ సహా వైసిపి నేతల పేర్లను సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది. వైఎస్‌ఆర్ పలనాడు కరవు నివారణ ప్రాజెక్టు పేరును మారుస్తూ ... గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్ధారించారు. వైఎస్‌ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పేరును మారుస్తూ ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా నిర్థారిస్తూ ఆదేశాలిచ్చారు.












Click it and Unblock the Notifications