గోదావరి పుష్కరాల వేళ కీలక నిర్ణయాలు - భక్తుల కోసం ఈ సారి ప్రత్యేకంగా..!!
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ సారి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే లా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. కుంభమేళా తరహా ఏర్పాట్ల పైన కసరత్తు జరుగుతోంది. రూ 3 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సారి పుష్కర ఘాట్లు.. వసతి కోసం టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారీగా రైళ్లు.. బస్సులను ముందుస్తుగానే ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో ఈ సారి భక్తుల కోసం ప్రత్యేకంగా మరిన్ని కీలక నిర్ణయాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2027 జూన్‌లో జరిగే పుష్కరాలకు ఏడాదిన్నర ముందు నుంచే ప్రణాళికలు వేస్తోంది. ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 500 పైగా ఘాట్‌లు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈసారి మొత్తం పుష్కరాల నిర్వహణకు దాదాపు రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2015లో సుమారు రూ. 1,400 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో కేంద్రం కొంత మేర సహాయం అందించింది. ఈసారి కేంద్రం నుంచి మెజార్టీ వాటా రప్పించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక 2015లో 4.50 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా, 2027 పుష్కరాలకు 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భక్తుల సంఖ్యకు అనుగుణంగానే ఏర్పాట్లు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి కే పాత ఘాట్లు ఎలా ఉన్నాయో తనిఖీ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించింది. ముందుగా ఘాట్ల నిర్మాణ పనుల టెండర్లకు సిద్ధమవుతోంది. అలానే పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. దానికి తగ్గట్లు ఏర్పాట్లకు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం 5 వేల బస్సులు, దాదాపు 2,800 రైళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల బృందం, కార్యదర్శుల బృందంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించింది. జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్లు కమిటీలను ఏర్పాటు చేసుకుని పనులను పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications