తల్లికి వందనం లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!

ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ పథకం వర్తింప చేస్తూ నిధులు విడుదల చేసారు. అయితే, క్షేత్ర స్థాయిలో పలు చోట్ల అర్హుల జాబితాలో లోపాలను గుర్తిస్తున్నారు. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో లబ్దిదారుల ఖాతాల్లో ఈ పథకం కింద జమ అయిన నగదు ను బ్యాంకులు.. లబ్దిదారుల గత బకాయిల కింద జమ చేసుకుంటున్నాయి. అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హత ఉండీ పథకం అందని వారికి.. పథకం అమలు కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.

జాబితాల్లో లోపాలు
ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధులు విడుదల చేసింది. అయితే, అర్హత ఉండి నగదు అందని వారి కోసం ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో తుది జాబితాల్లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు సరి దిద్దేందుకు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేసింది. తల్లికి వందనం ద్వారా 67,27,624 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్ల లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులు ఎంత మంది ఉన్నా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే మనమిత్ర వాట్సాప్ లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయటం ద్వారా పరిష్క రిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ap-govt-key-suggestions-for-thalli-ki-vandanam-beneficiaries-details-here

పరిష్కారం ఏంటి
లబ్దిదారుల్లో తల్లుల బ్యాంకు ఖాతాలు ఇన్ యాక్టివ్ గా లేని వారిని గుర్తించిన ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా మెసేజ్ ల ద్వారా అప్రమత్తం చేసింది. లబ్దిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివా లయాల్లో ప్రదర్శించారు. కాగా, లోపాలను గుర్తించిన అధికారులు.. తక్షణం పరిష్కరించాలని నిర్దేశించారు. ఒకే తల్లి పేరు పలువురి పిల్లల పేర్లకు చూపించటం.. ఒకే ఆధార్ నెంబరు అనేక మంది పేర్లతో అనుసంధానం చేసినట్లు జాబితాల్లో కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.17 లక్షల మంది వివరాల్లో తప్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించిన అధికారులు.. ఇప్పటి వరకు దాదాపు గా 84 వేల పొరపాట్లను సరి చేసారు. మిగిలినవి పూర్తిగా సరి దిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రతీ అర్హత ఉన్న లబ్దిదారునికి పథకం అందుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

బ్యాంకుల్లో సమస్యలు
ఇక, మరి కొన్ని చోట్లు కొత్త సమస్యల వెలుగు లోకి వచ్చింది. తల్లికి వందనం పథకం డబ్బుల డ్రా చేసుకునేందుకు వెళ్లిన వారికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొందరికి బ్యాంకు అధికారులు చెప్పే సమాధానాలు విని ఖంగుతింటున్నారు. అప్పటికే వారి పేరిట బ్యాంకులో పొదుపు రుణం బాకీ ఉందని రూ.13,000లను అందులో జమ చేశామని అధికారులు చెప్పటంతో లబ్దిదారులు షాక్ అయ్యారు. ప్రభుత్వం పిల్లల చదువులకు వేసిన మొత్తాలను తల్లుల అప్పుల పేరుతో బ్యాంకు అధికారులు జమ చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ఈ విషయం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్ చేరిన వారి డేటాను సేకరించి జూలై 6న వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+