మందుబాబులకు కొత్త నిబంధనలు - ఇక మద్యం కొంటే, తప్పనిసరిగా..!!

ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో కొత్త విధానం అమల్లోకి తెస్తోంది. నూతన మద్యం పాలసీతో బ్రాండెడ్ మద్యం తో పాటుగా రూ 99 కే క్వార్టర్ మద్యం అమందుబాటులోకి వచ్చింది. అదే విధంగా మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వం నిఘా పెట్టింది. పని వేళల ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. మందుబాబుల నుంచి మద్యం కొనుగోలు వేళ ఫీడ్ బ్యాక్ తప్పని సరి చేసారు. ఇక.. దుకాణాల వద్దే మద్యం కొనుగోలు చేసి అక్కడే సేవిస్తే చర్యలకు సిద్దం అవుతోంది. ఇందు కోసం ప్రత్యేకంగా తనిఖీలకు నిర్ణయించారు.

తాజా నిర్ణయంతో
రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మద్యం షాపులు ఉదయం 10నుంచి రాత్రి 10 వరకు, బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11గంటల వరకు పనిచేయాలి. అయితే, పలు ప్రాంతాల్లో నిర్దే శించి సమయానికి భిన్నంగా అమ్మకాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అందు లో భాగంగా ఉదయం 10గంటలకు ముందే షాపులు తెరిచి అమ్మకాలు ప్రారంభిస్తున్నారు. అలా గే రాత్రి 10తర్వాత కూడా మరో అరగంట అమ్మకాలు కొనసాగుతున్నాయి. బార్లు ఎప్పుడు వచ్చి నా బార్లా తెరిచి ఉంటున్నాయి. ఏ సమయంలో అయినా మద్యం దొరుకుతుందంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఈ ఉల్లంఘనలపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది.

ap-govt-latest-guide-lines-for-liquor-shops-and-bars-details-here

ఫొటోలు తీసి
ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ సమీక్షలో జిల్లా స్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. మద్యం షాపులు, బార్ల పనివేళల ఉల్లంఘనలు, షాపుల వద్ద తాగుడుపై అధికారులు నిఘా పెట్టారు. అందులో భాగంగా ప్రతిరోజూ షాపులు, బార్ల పనివేళలు ప్రారంభానికి ముందు, ముగిసే సమయంలో కానిస్టేబుళ్లను పంపి ఫొటోలు తీయించాలని ఆదేశించారు. జియో కోఆర్డి నేట్స్‌ రికార్డ్‌, సమయం రికార్డు అయ్యేలా ఫొటోలు తీసి కానిస్టేబుళ్లు స్టేషన్ల సీఐలకు పంపుతు న్నారు. వారు వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. గతంలో మద్యం షాపుల వద్ద తాగేందుకు వీలుగా పర్మిట్‌రూమ్‌లు ఉండేవి. దీనిపై ఎక్సైజ్‌ అధికారులు సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో నూతన మద్యం పాలసీలో పర్మిట్‌రూమ్‌లకు అవకాశం ఇవ్వలేదు. అయినా అనధికా రికంగా షాపుల వద్ద తాగే విధానం కొనసాగుతోంది.

షాపు వద్దే తాగితే
ఒకవేళ పర్మిట్‌రూమ్‌లకు అవకాశం ఇచ్చి ఉంటే ఏడాదికి రూ.170 కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. అయితే, ఇటీవల కాలంలో షాపుల వద్ద తాగుడుపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టారు. షాపుల వద్ద ఎవరూ తాగకూడదని, కొనుకున్న మద్యాన్ని ఇంటికి తీసుకెళ్లి తాగాలని స్పష్టంచేస్తున్నారు. బెల్టు షాపులు.. ఎమ్మార్పీ ఉల్లంఘనల పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో.. మందుబాబుల నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీల ద్వారా క్షేత్ర స్థాయి ఉల్లంఘన లను నియంత్రించాలని ప్రభుత్వ నిర్దేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+