ఏపీలో నిప్పుల కొలిమి: రంగంలోకి హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తాపం అప్పుడే మొదలైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, హోం మంత్రి అనిత అప్రమత్తమయ్యారు. మంగళవారం ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) కార్యాలయంలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆమె ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి 'హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026'ను ఆవిష్కరించిన మంత్రి, ఎండల తీవ్రతను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
అమరావతి వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంది. రాగల రెండు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ, ఆ తర్వాతి నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్న గాలుల ప్రభావంతో పొడి వాతావరణం మరింత బలపడుతోంది.

వడదెబ్బతో ప్రాణనష్టం జరగకూడదు: మంత్రి అనిత
ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత స్పష్టం చేశారు. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ తక్షణమే స్పందించి వడదెబ్బ బారిన పడే వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్లు, అవసరమైన మందులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరియు బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారికి తగిన చలువ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
చలివేంద్రాల ఏర్పాటు.. మౌలిక వసతులపై నిఘా
ప్రజల దాహార్తిని తీర్చడానికి మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద తప్పనిసరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఎన్జీవోలు, కమ్యూనిటీ గ్రూపుల ద్వారా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఎండలు పెరుగుతున్న వేళ తాగునీటి సరఫరాలో, విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని సంబంధిత శాఖలకు సూచించారు. పశువుల రక్షణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన సూచనలు జారీ చేయాలని మంత్రి అనిత అధికారులను కోరారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications