పదో తరగతి పరీక్షల వేళ ప్రత్యేక ఏర్పాట్లు - కీలక సూచనలు..!!

పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ముఖ్యమంత్రి.. మంత్రి లోకేష్ విషెస్ చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిం చింది. నేటి నుంచి ఈనెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

నేటి నుంచి ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 6,49,884 హాజరు కానున్నారు. వారిలో బాలురు 3,36,225 కాగా, బాలికలు 3,13,659 ఉన్నారు. మొత్తం పరీక్షా కేంద్రాలు 3,450 ఏర్పాటు చేసారు. 156 ఫ్లయిం గ్‌ స్క్వాడ్‌లు పర్యవేక్షించనున్నాయి. 163 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అని పరీక్షా కేంద్రాలను మొబైల్‌ రహితంగా ప్రకటించారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌కు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

ap-govt-made-all-arrangements-for-tenth-class-examinations-to-begin-today

కీలక సూచనలు
పరీక్షలు జరిగే కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ల్యాప్‍ట్యాప్‍లు, కెమెరాలు, ట్యాబ్‌లు, ఇయర్‌ ఫోన్లు, స్పీకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, బ్లూటూత్‌ వంటి వాటిని అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది టెన్త్‌ విద్యార్థులకు ఎన్‌సీ ఈఆర్‌టీ సిలబస్‌ అమలు చేశారు. మొత్తం విద్యార్థుల్లో 51,069 మంది తెలుగు మీడియంలో పరీక్షలు రాయనున్నారు. ఒడియాలో 838 మంది, తమిళంలో 194 మంది, కన్నడలో 623 మంది, హిందీలో 16 మంది, ఉర్దూలో 2,471 మంది పరీక్షలు రాయనున్నారు. వీరితో పాటు ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ విద్యార్థులకూ ఈ రోజు నుంచే పరీక్షలు జరగనున్నాయి.

చంద్రబాబు విషెస్
పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ శుభాకాం క్షలు తెలిపారు. అకడమిక్‌ ప్రయాణంలో టెన్త్‌ పరీక్షలు కీలక మైలురాలు లాంటివని, ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ హాల్‌ టికెట్‌ చూపించి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేరుకోవాని సూచించింది. ఇక, అధికారులు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+