andhra pradesh amaravati visakhapatnam vijayawada tirupati ap govt Coronavirus ఆంధ్రప్రదేశ్ అమరావతి విశాఖఫట్నం విజయవాడ తిరుపతి ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్
నేటి నుంచి ఏపీకి విదేశీయుల రాక- అడుగుపెట్టగానే క్వారంటైన్ కు...
కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్రం ఇవాళ్టి నుంచి వెనక్కి తీసుకురానుంది. ఇప్పటికే ఇందుకోసం ఎయిర్ ఇండియాతో పాటు పలు ప్రైవేటు విమానయాన సంస్ధలను వినియోగిస్తున్న కేంద్రం దాదాపు 14800 మందిని భారత్ తీసుకొస్తామని చెబుతోంది. అదే సమయంలో ఏపీకి వచ్చే విదేశీ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
విదేశాల నుంచి ఏపీకి తిరిగొస్తున్న వారిని విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులకు పంపనున్నారు. అక్కడి నుంచి స్ధానిక అధికార యంత్రాంగం వారిని ధర్మల్ స్ర్కీనింగ్ తో పాటు ప్రాధమిక పరీక్షలు నిర్వహిస్తారు. ఏమాత్రం కరోనా వైరస్ లక్షణాలు కనిపించినా వారిని క్వారంటైన్ కు, పరిస్దితి తీవ్రతను బట్టి ఆస్పత్రులకు తరలిస్తారు.

ఈ మేరకు విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. విదేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ఆధారంగా ఏపీకి వచ్చే వారిని వర్గీకరించనున్నారు. ప్రధానంా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అలాగే యూరప్ దేశాల నుంచి వచ్చే వారిని కూడా వైరస్ తీవ్రత ఆధారంగా ఆస్పత్రులకు తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.