టెస్లా కోసం ఏపీ బిగ్ ఆఫర్, ఆ జిల్లాకే ఛాన్స్ - గేమ్ ఛేంజర్..!!
ప్రపంచ దిగ్గజ సంస్థ టెస్లా కి వస్తుందా. ఎంత మేర అవకాశం ఉంది. ఇప్పుడు టెస్లా తమ కార్ల తయారీ యూనిట్ దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొప్పేందుకు ఆలోచన చేస్తోందని సమాచారం. దీంతో, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందు కోసం టెస్లా కు ఏపీ ప్రభుత్వం భారీ ఆఫర్లు ఇస్తోంది. రాయితీలతో సహా భూముల లభ్యత గురించి టెస్లా తో ఏపీ ముఖ్యులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. టెస్లా ఏర్పాటు కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. టెస్లా ఏపీకి వస్తే రాష్ట్ర భవిష్యత్ కు గేమ్ ఛేంజర్ గా మారనుంది.
ఏపీ ప్రభుత్వం ఆఫర్
ఏపీకి టెస్లా రప్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రపంచ దిగ్గజ సంస్థగా ఉన్న టెస్లా తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలను భారతీయ మార్కెట్ లో అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తోంది. కార్ల తయారీ ప్లాంట్ ను దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభించాలని భావిస్తోంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రాధమికంగా టెస్లా తమ యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే తమ నుంచి అందించే రాయితీలతో పాటుగా భూముల లభ్యత గురించి వివరించారు. దీంతో.. తాజాగా టెస్లా బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలోని భూములను పరిశీలించినట్లు సమాచారం.

గేమ్ ఛేంజర్
టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పేందుకు 2017లోనే ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరిస్తామని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌కు హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఇటీవల తన అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కలిసి ఏపీలో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ నెలకొల్పే అంశంపై చర్చలు జరిపారు. టెస్లా వస్తే పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ దక్కనుంది. దీంతో కూటమి ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.












Click it and Unblock the Notifications