Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డిపాజిట్లతో అక్షయ్ గోల్డ్ కుచ్చుటోపీ: ఆస్తుల జప్తునకు ఆదేశం

 AP govt orders to attache Akshaya Gold properties
హైదరాబాద్: మనీ సర్క్యులేషన్ కింద ప్రజల నుంచి డిపాజిట్లను వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టిన అక్షయ గోల్డ్‌కు చెందిన ఆస్తులు, భూములను అటాచ్ చేయాలని సిఐడిని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సిఐడి శాఖ ఈ ఆస్తులను ఆటాచ్ చేస్తుంది.

దాదాపు వివిధ బ్యాంకుల్లో ఉన్న 10.15 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో 484 ఎకరాలు, విజయనగరం జిల్లాలో 1009 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 439 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 316.25 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 106.67 ఎకరాలను గుర్తించి అటాచ్ చేయాలని ప్రభుత్వం సిఐడికి ఆదేశాలు జారీ చేసింది.

మొత్తం 2354.92 ఎకరాల భూమిని అటాచ్ చేసేందుకు ఆంధ్రప్రభుత్వం సిఐడికి అనుమతి ఇచ్చింది. 10.15 కోట్ల రూపాయల సొమ్ము వివరాలను విశే్లషిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోల 26 ఎస్‌బిఐ బ్రాంచీలు, 33 ఎస్‌బిహెచ్ బ్రాంచీలు, 95 యాక్సిస్ బ్యాంకు బ్రాంచీలు, 38 హెచ్‌డిఎఫ్‌సి బ్రాంచీల్లో ఈ నగదు నిల్వలు ఉన్నట్లు సిఐడి కనుగొంది. ఈ కేసులో మొత్తం 26 మంది నిందితులు ఉన్నారని పేర్కొన్నారు.

డిపాజిట్లను వసూలు చేసి 20 శాతం వడ్డీ ఇస్తామని ఈ సంస్ధ మోసం చేసిందని అభియోగం మోపారు. అలాగే డిపాజిటర్‌కు స్ధలం కూడా ఇస్తామని కూడా అక్షయగోల్డ్ ఫార్మ్స్, విల్లాస్ ఇండియా లిమిటెడ్ ప్రజలకు హామీ ఇచ్చింది మోసం చేసిందని సిఐడి పేర్కొంది. ఈ కేసు ఒంగోలు ఒకటవ పోలీసు స్టేషన్‌లో నమోదు కాగా, సిఐడికి బదలాయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+