పాత మద్యం బ్రాండ్లు సిద్దం - అమ్మకాలు, ధరలపై కొత్త ఫార్ములా..!!
ఏపీలో కొత్త మద్యం పాలసీ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బ్రాండెడ్ కంపెనీల మద్యం అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతోనూ చర్చలు జరిగాయి. ధరల పైన కొత్ ఫార్ములా పైన నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తులకే అప్పగించటం ఖాయమైంది. పలు కొత్త నిర్ణయాలతో ప్రభుత్వ మద్యం పాలసీకి తుది రూపు ఇస్తున్నారు.
మద్యం పాలసీ
ఏపీలో కొత్త మద్యం పాలసీ సిద్దం అవుతోంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పాలసీ తయారీ కోసం అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది ఏపీ సర్కార్. దేశంలో ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఏ విధంగా ఉన్నాయి.. ఆ పాలసీ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి.. ప్రయోజనాలు ఏమిటి.. ఇలా అన్నింటిపైనా ఫోకస్ పెట్టింది. ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రయివేటు వ్యక్తులకు ఆక్షన్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇప్పటికే పాలసీ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ పలు అంశాలపై చర్చించింది.

ధరలు -అమ్మకాలపై
బ్రాంది, విస్కీ, బీరుల్లో గతంలో ఉన్న బ్రాండ్లను ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్న బ్రాండ్లను విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటుంది. తక్కువ ధరకు మద్యం అమ్మకాలు చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేలా కొత్త ఎక్సైజ్ పాలసీలో కసరత్తును ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది. గత అయిదేళ్ల కాలంలో అందుబాటులో లేకుండా పోయిన ప్రముఖ బ్రాండ్ల మద్యం ఏపీలో తిరిగి అందుబాటులోకి రానుంది. ధరలపై కంపెనీ ప్రతినిధులతోనూ చర్చలు జరిగాయి.
మంత్రివర్గం ముందుకు
రాష్ట్రంలో ఎంఎన్‌సీ బాండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని ఆలోచిస్తోంది. తక్కువ ధర కేటగిరిలో క్వార్టర్ బాటిల్‌ను రూ.80 నుంచి రూ.90 లకే అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. వీటిన్నింటినీ పరిశీలించి నూతన మద్యం విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం రూపొందించనుంది. అలాగే మద్యం విషయంలో అక్రమాలకు తావులేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం..అమ్మకాల్లో మెరుగైన విధానం పైన కసరత్తు తుది దశకు చేరింది. సీఎంతో చర్చించిన తరువాత వచ్చే మంత్రివర్గ సమావేశంలో నూతన మద్యం పాలసీని ఆమోదించనున్నారు.












Click it and Unblock the Notifications