ఇక ఆ స్థలమూ, ఇల్లు మీదే - వారికే యాజమాన్య హక్కులు, తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు అమలుకు సిద్దమైంది. గ్రామ కంఠాల్లో ఉన్న ఇళ్లు.. స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం వేగవంతం చేస్తోంది. ఇందు కోసం కాల పరిమితి ఖరారు చేసింది. డిసెంబరు నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తిచేస్తారు. కాగా. ప్రస్తుతం 6వేల గ్రామాల్లో ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌ ఆధారంగా ఆస్తుల కొలతలను సేకరిస్తున్నారు. ఇక.. వచ్చే ఏడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులను ప్రభుత్వం జారీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో దశాబ్దాల క్రితం నాటి ఇళ్లు, స్థలాలకు ఇప్పటికీ యాజమాన్య హక్కుల్లేవు. వీటిని విక్రయించినా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్టర్‌ చేయరు. ఆస్తులు గ్రామకంఠాల్లో ఉండటమే ప్రధాన కారణం. వీటిపై ప్రజలకు యజమాన్య హక్కులు కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ కార్యక్రమాన్నితిరిగి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అయింది. వీరికి యాజమాన్య కార్డులను ప్రభుత్వ అధికార చిహ్నంతో ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయి యూనిట్‌ని బలోపేతం చేయడం తోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంది. ఇందు కోసం గ్రామ సచివాలయాల సిబ్బందిని ఇందులో భాగస్వాములను చేసింది.

ap-govt-planning-to-implement-swamitva-in-the-state-to-issues-property-rights

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 గ్రామాల్లో 45 లక్షల ఆస్తుల సమగ్ర వివరాలు డ్రోన్ల ద్వారా సేకరించారు. వీటి ఆధారంగా ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌లను రూపొందించి ప్రాపర్టీ పార్సిల్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారు. వీటిలో ప్రతి ఇల్లు, స్థలం పొడవు, వెడల్పు వివరాలు నిక్షిప్తమయ్యాయి. వీటి నిర్ధారణకు రెవెన్యూ, సచివాలయాల సిబ్బంది ప్రతి ఆస్తికీ కొలతలు తీస్తున్నారు. ఇప్పటికే 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తయింది. మరో రెండు, మూడు రోజుల్లో మిగిలినవీ పూర్తి చేయనున్నారు. ఆస్తులపై నిర్ధారించుకున్న కొలతలతో సెక్షన్‌ 9(2) ప్రకారం వచ్చే నెలలో ప్రజలకు నోటీసులిచ్చి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక క్షేత్రస్థాయి తనిఖీ పూర్తయినట్లు సెక్షన్‌ 13 కింద ప్రకటిస్తారు.రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌ఓఆర్‌) కింద ఆస్తులకు యాజమాన్య హక్కు లు కల్పిస్తూ ముద్రించిన జాబితాలు సచివాలయాల్లో, పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వీరికి యాజమాన్య కార్డులు ఇవ్వటం ద్వారా బ్యాంకు రుణాలు, రిజస్ట్రేషన్లు చేయించుకునే వెసులుబాటు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+