బడ్జెట్ లో మహిళలకు నెలకు రూ 1500 పథకం, ఉద్యోగులకు పీఆర్సీ ..!?

AP Budget 2026-27: మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు విజయవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో బడ్జెట్ ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు. వీటికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ప్రత్యేకంగా సమావేశమైన కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఈ సారి బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా మహిళలు.. ఉద్యోగులకు వరాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఏపీ ప్రభుత్వం 2026-27 బడ్జెట్ ను ప్రతిపాదించేందుకు సిద్దమైంది. దాదాపు రూ 3.48 లక్షల కోట్ల ప్రతిపాదనలతో బడ్జెట్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్ లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించినట్లు సమాచారం. అదే విధంగా ఉద్యోగుల పీఆర్సీ పైన స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. బడ్జెట్ ప్రతులను అధికారులు మంత్రి కేశవ్ కు అందచేసారు.

AP Govt priority for Development- Welfare in Budget 2026-27 cabinet approves the proposals

బడ్జెట్ ప్రతులతో వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్న మంత్రి.. అక్కడ మరోసారి పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అక్కడి నుంచి సచివాలయానికి బయలుదేరారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో మరోసారి పూజలు చేసిన అనంతరం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో జరగనున్న కేబినెట్ సమావేశానికి పద్దు ప్రతులతో హాజరుకానున్నారు.

హామీల అమలుకు ప్రాధాన్యత

ఈసారి వార్షిక బడ్జెట్ సుమారుగా రు.3.48 లక్షల కోట్ల నుండి 3.50 లక్షల కోట్ల రూపాయలకు అటు, ఇటుగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం నేడు (శనివారం) ఉభయసభలలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్లో మెజార్టీ నిధులు రెవెన్యూ వ్యయానికే ఖర్చు చేయనున్నారని సమాచారం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమానికి నిధుల కొరత లేకుండా చూడాలని, అదే సమయంలో అభివృద్ధిపనులకు అవకాశం ఉండేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని దిశా నిర్దేశం చేయడంతో ఆ మేరకు ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు సమాచారం.

గత ఏడాది 3.22 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రతిపాదింగా, ద్రవ్య వినిమయ బిల్లు సమయంలో దీనిని 3,31,166 కోట్లుగా సవరించి ఆమోదించారు. ఇంత భారీగా ఆమోదం పొందిన ప్రతిపాదనల్లో 80 శాతం కూడా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందని సమాచారం. ఆదాయం కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టిన స్థాయిలో రాకపోవడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడం వంటి కారణాలతో ఖజానా తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో.. ఈ సారి ప్రతిపాదనల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+