పింఛన్‌దారులను షాక్ ఇస్తోన్న ఏపీ ప్రభుత్వం
గత ఎన్నికల్లో భారీ హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఐదు నెలలు దాటింది.కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయిలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకుండానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది.
కూటమి ప్రభుత్వం లో తగ్గిన పింఛన్లు 👇
— YSRCP USA (@ysrcp_usa) December 1, 2024
మే లో పెన్షన్ పంపిణీ లు -65 ,49 ,864
డిసెంబర్ -63 ,92 ,702
మొత్తం తగ్గిన పింఛన్లు -1 ,57 ,162#SaveAPFromKutami #AndhraPradesh pic.twitter.com/D98HRHgpSk
అయితే పెన్షన్లను లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెలకు తగ్గిపోతూ వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వారి కన్నా తక్కువ మందికి పెన్షన్ల ఇస్తున్నారు. పెన్షన్ల విషయంలో ప్రతినెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. జగన్ ప్రభుత్వంలో మే నెలలో పెన్షన్ పంపిణీ 65 ,49 ,864కి పంపిణీ చేయగా, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 64,14,174 మందికి పెన్షన్ అందజేశారు.అయితే డిసెంబర్ నెలకు వచ్చే సరికి ఈ సంఖ్య 63 ,92 ,702మందికి చేరింది.

రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు ఉన్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది.పెన్షన్లను వేయి రూపాయిలు పెంచారని ఆనందపడేలోపే, లక్షల సంఖ్యలో పెన్షన్లను తొలగించి లెక్కలను సరి చేసుకుంటుందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే.. వైసీపీ హయంలో ఇష్టమొచ్చినట్టు పెన్షన్లు ఇచ్చారని సాకుగా చూపించి లబ్ధిదారుల తగ్గిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications