వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా చికిత్స ఇలా.. ఏపీ సర్కార్ కొత్త మార్గదర్శకాల విడుదల..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ చికిత్సలను మరింత నాణ్యంగా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలన విడుదల చేసింది. వీటి ప్రకారం ఎవరిని ఏయే ఆస్పత్రులకు పంపాలి, వారికి ఎలాంటి చికిత్స అందించాలి వంటి వివరాలు ఉన్నాయి. వీటిని ఆస్పత్రులన్నీ తప్పకుండా పాటించాలని ప్రభుత్వం సూచించింది.

ఏపీలో కరోనా చికిత్సలు- మార్గదర్శకాలు..

కరోనా బాధితులకు ఏ చికిత్స చేయాలి.? ఏ మందులిస్తే తగ్గుతుంది. ఏ వయసు వారికి ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.కరోనా బాధితుల చికిత్సకు సంబంధించి తాజాగా వైద్యులు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 4 రాష్ట్ర కరోనా ఆస్పత్రులు, 13 జిల్లా ఆసుపత్రులు నిరంతరం సేవలందిస్తున్నాయి.

ap govt release new guidelines for covid 19 treatment

తాజా మార్గదర్శకాలివీ..

ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం 60 ఏళ్లు దాటిన వారికి వైరస లక్షణాలున్నా, లేకున్నా కరోనా రాష్ట్ర ఆస్పత్రులకు తరలించాలి. అలాగే 40-60 ఏళ్ల మధ్య వయసున్న వారిని కూడా ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోయినా రాష్ట్ర కరోనా ఆస్పత్రులకే పంపాలి.
వయసుతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని రాష్ట్ర ఆస్పత్రులకు తరలించాలి. శ్వాస ఆడనివారు, బైల్ రూబిన్ పెరిగిన వారిని ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స చేయాలి.

వీరికి రాష్ట్ర కోవిడ్ ఆస్పత్రుల్లోనే ...

మధుమేహం, హైపర్ టెన్షన్, గుండెజబ్బు, ఊపిరితిత్తుల రుగ్మత, క్రానిక్ కిడ్నీ జబ్బులు, క్రానిక్ లివర్ వ్యాధి, వ్యాధి నిరోధక శక్తి లోపించడం, హెచ్ ఐవీ, పుట్టుకతో కొన్ని జబ్బులతో ఉన్నవారికి కచ్చితంగా రాష్ట్ర ఆస్పత్రులలో చికిత్స చేయాలి

. అలాగే డిశ్చార్జ్ నియమాలను కూడా ఇందులో పొందుపరిచారు. వీటి ప్రకారం కరోనా రోగికి 14 నుంచి 15వ రోజు టెస్ట్ చేస్తారు. గొంతులో ద్రవాన్ని పరీక్షిస్తారు. రెండు సార్లు నెగెటివ్ రావాలి. 29 - 30వ రోజు మరోసారి పరీక్షలు చేస్తారు. ఒకవేళ మళ్లీ పాజిటివ్ వస్తే తిరిగి ఆస్పత్రికి రావాలి. డిశ్చార్జి అయ్యాక 14 రోజులు విధిగా ఐసోలేషన్ లో ఉండాలి.

English summary
andhra pradesh government on tuesday issued new guidelines for covid 19 treatment in the state. guidelines including which age group patients to send covid 19 hospitals and which kind of treatment to be given also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X