పెన్షన్ల పంపిణీ వేళ ప్రభుత్వం బిగ్ అప్డేట్..!!

ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పెన్షన్ రూ 4 వేలకు పెంచింది. అప్పటికే ఇస్తామని చెప్పిన మూడు నెలలకు కలిసి రూ 7 వేలు చొప్పున జూలై 1న పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితో ఈ పంపిణీ పూర్తి చేసారు. ఇక..ఆగస్టు 1న పంపిణీ చేయనున్న పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది.

నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. రేపు (గురువారం) ఉదయం ఆరింటి నుంచి ఊరురా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్‌ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఆగస్టు నెలకు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64. 82 లక్షల మందికి రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

AP govt released rs 2 734 cr for Social pesions distribution for hte month of August

పెన్షన్ల పంపిణీ కోసం
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96 శాతం, 2న 100 శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వఅద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు అందిస్తున్నారు. ఇక, సీఎం చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్లు అందజేయనున్నారు. మల్బరీ నాట్లు, పట్టు పురుగుల షెడ్లను కూడా పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి, గ్రామస్థులతో సీఎం మాట్లాడనున్నారు. అదే రోజు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని, ప్రాజెక్టు దగ్గర జలహారతి ఇవ్వనున్నారు.

AP govt released rs 2 734 cr for Social pesions distribution for hte month of August

ప్రభుత్వం మార్గదర్శకాలు
ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ఆర్దికంగా సమస్యలు ఉన్నా పెన్షన్ల పంపిణీ అమలు మాత్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాల హామీల అమలుకు ఆర్దికంగా సమస్యలు ఉన్నాయని తాజాగా శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. తల్లికి వందనం పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో, పెన్షన్ల పంపిణీ పథకం మాత్రం లబ్దిదారుల మధ్య నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+