విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి ఆహ్వాన పత్రిక ఇదీ, వెంట తీసుకు రావాల్సిందే (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.

మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు తొలుత ఆహ్వాన పత్రికలను చంద్రబాబు అందించారు. మంత్రివర్గ సహచరులకు, ఉన్నతాధికారులకు అందజేశారు.

అమరావతి ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైనలైజ్ చేశారు. ఇందుకోసం ఏడెనిమిది మోడల్స్ చూశారు. సీఎం ఓకే చెప్పిందాన్ని ముద్రిస్తున్నారు.

అమరావతి ఆహ్వాన పత్రిక

అమరావతి ఆహ్వాన పత్రిక

మొదటి పేజీలో అమరావతి శంకుస్థాపన ఆహ్వాన కార్యక్రమమని ముద్రించారు. రెండో పేజీలో ఒకటో శతాబ్దానికి చెందిన అమరావతి స్థూపాన్ని చిత్రీకరించారు.

అమరావతి ఆహ్వాన పత్రిక

అమరావతి ఆహ్వాన పత్రిక

స్థూపంపై నుంచి చూస్తే తామరపువ్వు పోలినట్లు ఉంది. మూడో పేజీలో ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలుకుతున్నట్లు, ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపనకు నిర్ణయం జరిగిందనే సమాచారాన్ని పొందుపరిచారు.

అమరావతి ఆహ్వాన పత్రిక

అమరావతి ఆహ్వాన పత్రిక

నాలుగో పేజీలో సింగపూర్‌ ప్రభుత్వం ఇచ్చిన ఊహా చిత్రాన్ని ముద్రించారు. పూర్వపు, భవిష్యత్తు అమరావతిని ఆహ్వాన పత్రికలో ఆవిష్కరించినట్లు ఉంది.

అమరావతి ఆహ్వాన పత్రిక

అమరావతి ఆహ్వాన పత్రిక

పత్రికలోని బార్‌కోడ్‌లో కార్యక్రమానికి, అమరావతికి సంబంధించిన అంశాలున్నాయి. ఆహ్వాన పత్రికలు అందుకున్న వారు వాటిని తప్పక తీసుకురావాలని విన్నవించింది.

 అమరావతి ఆహ్వాన పత్రిక

అమరావతి ఆహ్వాన పత్రిక

అక్టోబర్ 22, 2015న మధ్యాహ్నం గం.12.45 నిమిషాలకు శంకస్థాపన జరుగుతుందని తెలియజేస్తూ... పత్రికను ముద్రించారు. ఒక వైపు ముహూర్తాలు, మరోవైపు అమరావతి స్థూపం ఉంటుంది. నాలుగు పేజీలు ఉన్నాయి. తారప పుష్ప ముద్ర, మరోవైపు నగర ప్రణాళికలు ఉన్నాయి.

అమరావతి ఆహ్వాన పత్రిక

అమరావతి ఆహ్వాన పత్రిక

ఆహ్వానితులంతా ఉదయం పదిన్నర గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని, భద్రతా కారణాల రీత్యా ఆహ్వాన పత్రికను తమతో ఉంచుకోవాలని, కేవలం ఆహ్వానితులు మాత్రమే రావాలని అందులో స్పష్టం చేశారు.

అమరావతి ఆహ్వాన పత్రిక

అమరావతి ఆహ్వాన పత్రిక

హ్యాండ్ బ్యాగ్స్, బ్రీఫ్ కేసులు, కెమెరాలు మొబైల్ ఫోన్లు, సిగరేట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మంచినీటి సీసాలు, కార్ సెంట్రల్ లాకింగ్ వస్తువులు వంటి వాటిని వేదిక వద్దకు తీసుకు రావద్దని కోరారు.

English summary
AP Govt Releases Amaravati Foundation Ceremony Invitation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X