శుభవార్త చెప్పిన చంద్రబాబు సర్కార్.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులకు జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి శుభవార్త చెబుతానని పేర్కొన్న మంత్రి లోకేష్ ఎప్పుడు ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా అని నిరీక్షిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పడానికి కసరత్తు చేస్తోంది.

మరో జాబ్ నోటిఫికేషన్ కు ఏపీ సర్కార్ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు సిద్ధమవుతుంది. ప్రతి సంవత్సరం డీఎస్సీని ప్రకటించి టీచర్ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఆ హామీకి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా డీఎస్సీ నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో దాదాపు 2500 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని సమాచారం.

ap govt said unemployed good news over DSC jobs notification will be in february

ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు
రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రద్దయిన జీవో 117 స్థానంలో తొమ్మిది రకాల పాఠశాలలను ప్రవేశపెట్టి, 9200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా మార్చారు. ప్రతి తరగతికి ఒక టీచర్ నిబంధనతో అదనంగా ఒక వెయ్యి 146 మంది టీచర్ల అవసరమని గుర్తించారు.

ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల
ఈ ఖాళీలతో కూడా కలిపి మొత్తం 2500 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈ నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడం మాత్రమే కాక విద్యా ప్రమాణాలను పెంచడం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇక ఇదే సమయంలో డీఎస్సీ పరీక్షల్లో కూడా కీలక మార్పులు చేయనుంది.

నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేళ స్వీట్ న్యూస్
డీఎస్సీ పరీక్షలో ఆంగ్లభాష మరియు కంప్యూటర్ అవగాహన పైన ప్రత్యేకమైన పేపర్ ఉంటుంది. గతంలో కేవలం సబ్జెక్టు ప్రాధాన్యంగా జరిగే పరీక్షను మాత్రమే టీచర్ అభ్యర్థులు రాయవలసి ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావడంతో ప్రత్యేక పేపర్ ను నిర్వహిస్తారు. టీచర్ పోస్టుల భర్తీకి ఆంగ్లభాష ప్రావీణ్యం తప్పనిసరి అని ఈ ప్రభుత్వ నిర్ణయంతో తెలుస్తోంది. ఏది ఏమైనా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేళ డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్న వార్త వారికి శుభవార్త అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+