ప్రభుత్వం సీరియస్ - కేసుల నమోదుకు ఆదేశం...!!
ప్రభుత్వ ఇమేజ్ ను డామేజ్ చేసే ఉద్దేశంతో చేస్తున్న ప్రచారం పైన అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్న వారి పైన కేసులు పెట్టాలని ఆదేశించారు. విస్సన్నపేట లో కొందరు కావాలని ఒక సంఘటనను అక్కడికక్కడే ప్లాన్ చేసి అది నిజం అనేలా వార్తగా రూపొందించి జనంలోకి వదిలారు. ఈ రకంగా చేసిన వారి పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖాధికారి విస్సన్నపేట మండల విద్యాధికారిని ఆదేశించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు విస్సన్నపేట పాఠశాలపైన చేసిన ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. కల్పించి ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేయటంతో కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. వాస్తవానికి విస్సన్నపేట జడ్పి హైస్కులును రూ. 66 లక్షలతో నాడు - నేడు పథకంలో ఆధునీకరించారు. కొత్త బెంచీలు, స్కూల్లో పచ్చదనం. శుభ్రమైన టాయిలెట్లు .. స్కూల్ చూస్తే ముచ్చటపడేలా ఉంది. అయితే ఆ పాఠశాలకు కొత్త భవనాలు, అదనపు వసతులు సమకూరడంతో కొన్ని పాత భవనాలు, అప్పట్లో నిర్మించి శిథిలావస్థకు చేరిన అస్బెస్టాస్ రేకుల భవనాలు వినియోగించకుండా వదిలేశారు.

ఆ రేకుల భవనాల్లోకి నీరు చేరింది. అయితే సదరు పత్రికావిలేకరులు, ఛానెల్ విలేకరి కలిసి పాఠశాల ప్రారంభానికి ముందే బడి ఆవరణలోకి వెళ్లి అక్కడ ఆడుకుంటున్న పిల్లలను ఆ శిథిలావస్థలో ఉన్న గదిలోకి తీసుకెళ్లి, బలవంతాన కూర్చోబెట్టి ఫోటోలు, వీడియోలు తీసినట్లు అధికారుల విచారణలో తేలింది. అంటే అక్కడ సమస్య ఏమీ లేకున్నా ఉన్నది లేనట్లు చిత్రీకరించి వార్తను రూపొందించి జనంలోకి వదిలారు. వాస్తవానికి భిన్నంగా, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసే దురుద్దేశంతో ప్రజల్లోకి వెళ్లిన ఆ వార్తల విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇలా వ్యవహరించిన వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలని అధికారులు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ జరపాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications