ఏపీలో పది వేల ఉద్యోగుల బదిలీ - ఆర్దిక శాఖ కసరత్తు : 31న తుది ఉత్తర్వులు..!!
ఏపీలో దాదాపుగా పది వేల ఉద్యోగుల బదిలీకి రంగం సిద్దమైంది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటు..సిబ్బంది కేటాయింపు..వంటి వాటి పైన అధికారుల కమిటీ కసరత్తు కొలిక్కి వచ్చింది. కొత్త జిల్లాల తో పాటుగా కొత్తగా రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు తుది నిర్ణయం వెలువడ నుంది. ఈ నెల 31వ తేదీన కొత్త జిల్లాలు..డివిజన్ల తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

31న తుది నోటిఫికేషన్
దీంతో..కొత్త జిల్లాలకు..డివిజన్లకు ప్రొవిజనల్ గా ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ప్రస్తుతం 13 జిల్లాల్లో ఆసరా-సంక్షేమ జాయింట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న వారిని కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు రెవెన్యూ ఆఫీసర్లు (డీఆర్‌వో)గా నియమించాలని నిర్ణయించారు. అధికారులు ఇప్పటికే జిల్లాలతో పాటుగా డివిజన్ స్థాయిలో పోస్టుల విభజన పూర్తి చేసారు. ఉద్యోగుల ప్రొవిజనల్ కేటాయింపు కసరత్తు పూర్తయింది. జనాభా ప్రాతిపదికన ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. కొత్త జిల్లాలు, డివిజన్లకు సుమారు పది వేల మంది ఉద్యోగులు ప్రొవిజనల్ కేటాయింపుతో పాటు బదిలీలు కానున్నట్లు ఆర్ధిక శాఖ అంచనా వేసింది. ప్రొవిజనల్ కేటాయింపులో కొత్త జిల్లాలకు బదిలీ చేసే ఉద్యోగులు, అధికారుల సర్వీసు సీనియారిటీతో పాటు ఇతర సర్వీసు అంశాలన్నీ యథాతథంగా ఉంటాయి.

పది వేల మంది ఉద్యోగుల కేటాయింపు
కొత్త జిల్లాలు, డివిజన్లకు ప్రొవిజనల్ కేటాయింపులతో బదిలీ అయ్యే ఉద్యోగుల స్థానికత యథాతధంగా ఉంటుందని ఆర్ధిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి నుంచే ఉద్యోగుల నుంచి తీసుకున్న ఆప్షన్ల మేరకు కొత్త జిల్లాలు..కొత్త రెవిన్యూ డివిజన్లకు ఉద్యోగుల ప్రొవిజనల్ కేటాయింపులు చేస్తున్నారు. ఈ విధంగా ప్రొవిజినల్ కేటాయింపుల్లో వెళ్లే ఉద్యోగులకు సంబంధించి సీనియార్టీ.. పదోన్నుతల పైన ఎటువంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. బదిలీ అయ్యే అధికారులు.. ఉద్యోగులకు సంబంధించి బదిలీ ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని ఆర్దిక శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ బదిలీలు తాత్కాలికంగా పని చేయటానికి మాత్రమేనని ఆర్దిక తమ గైడ్ లైన్స్ లో పేర్కొంది.

సర్వీసుకు ఎలాంటి నష్టం లేకుండా
ఉద్యోగులకు ఎలాంటి ఇబందులు..నష్టం లేకుండా వారి సర్వీసు..సీనియార్టీ..హోదా వంటివి పరిగణలోకి తీసుకొని కేటాయింపులు పూర్తి చే్తున్నారు. ఈ నెల 31న జారీ అయ్యే తుది నోటిపికేషన్ తరువాత ఉద్యోగులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఉద్యోగి పేరు, గుర్తింపు నెంబర్, క్యాడర్, హోదా, ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం, ప్రొవిజనల్‌గా కేటాయిస్తున్న జిల్లా పేరుతో జాబితాలను సిద్దం చేస్తున్నారు. రెవిన్యూ డివిజన్ల పైన పెద్ద ఎత్తున అభ్యర్ధనలు రావటంతో చివరి నిమిషం వరకు వీటి సంఖ్య ఎంత ఉంటుందనేది స్పష్టత వచ్చే అవకాశం లేదు. ఈ రోజు శాసనసభ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కావటంతో.. కొత్త జిల్లాల పైన ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications