నేపాల్ వరదల్లో ఏపీ వాసులు- ఢిల్లీలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్- నంబర్లివే..!

నేపాల్ లో నిన్న ఆకస్మికంగా విరుచుకుపడ్డ వరదల ధాటికి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. దీంతో భారత్ కు చెందిన వందలాది మంది ఈ వరదల్లో గల్లంతయ్యారు. అలాగే ఏపీకి చెందిన వారు కూడా నేపాల్లో గల్లంతైనట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) వారిని ఆదుకునేందుకు, వారి కుటుంబాలకు సాయం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

IPS పీఎస్సార్ ఆంజనేయులు రిటైర్మెంట్- ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
IPS పీఎస్సార్ ఆంజనేయులు రిటైర్మెంట్- ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

నేపాల్ వరదల్లో (Nepal Floods) ఆంధ్రప్రదేశ్ వాసులు ఎవరైనా విపత్తులో చిక్కుకున్నారా అనే అంశంపై సమాచారం సేకరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేపాల్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. దీంతో అధికారులు వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటైంది.

AP Govt Sets Up Delhi Help Desk for AP Residents Affected by Nepal Floods
Nepal Flash Floods: వరదలకు నేపాల్ విలవిల..! 105 మంది భారతీయుల గల్లంతు..!
Nepal Flash Floods: వరదలకు నేపాల్ విలవిల..! 105 మంది భారతీయుల గల్లంతు..!

ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్లను ప్రభుత్వం వెల్లడించింది. ఫోన్ చేసేందుకు 011-23384016 011-23387089 నంబర్లు, వాట్పాప్ చేసేందుకు 9059824101 నంబర్ ను విడుదల చేసింది. ఏపీ నుంచి నేపాల్ కు వెళ్లి చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరుతోంది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షణతో బాధిత యాత్రికులకు సహకారం అందించాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+