Nepal flash floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు టూరిస్టులు గల్లంతు..? హైల్ప్ లైన్ నంబర్లు ఇవే..
నేపాల్ ను ఆకస్మిక వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. నేపాల్- టిబెబ్ సరిహద్దుల్లో సంభవించిన ఈ వరదల కారణంగా ఇప్పటివరకూ 95 మంది మృతి చెందారు. అలాగే సుమారు 500 మంది గల్లంతయ్యారు. అయితే ఈ జలప్రళయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన 156 మంది బృందంలోని 140 మంది ఆచూకీ తెలియకపోవడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. నేపాల్- టిబెట్ సరిహద్దుల్లోని బోటేకోశీ నదికి భారీగా వరద పోటెత్తింది. ఈ వరద ధాటికి ఆ మార్గంలోని వంతెనలు కొట్టుకుపోగా, 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం అయ్యాయి.
హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం 156 మంది తెలుగు టూరిస్టులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. అయితే వీరిలో 16 మంది అనారోగ్యం కారణంగా బస చేసిన హోటల్ లోనే ఉండిపోయారు. మిగిలిన 140 మంది యాత్రికులు సందర్శన కోసం బయటకు వెళ్లారు. అదే సమయంలో బోటేకోశీ నదికి ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బయటకు వెళ్లిన తెలుగు టూరిస్టులతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. వారి ఫోన్ లు స్విచ్ఛాఫ్ వస్తున్న నేపథ్యంలో వారి బంధువులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. తమ వారి ఆచూకీ కోసం ట్రావెల్ ఏజెన్సీని, అధికారులను సంప్రదిస్తున్నారు. గల్లంతైన వారిని సురక్షితంగా గుర్తించేందుకు సహాయక చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాలను కోరుతున్నారు.

మరోవైపు నేపాల్ వరదలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు దిల్లీలోని తెలంగాణ భవన్ లో హెల్ప్ లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. హెల్ప్ లైన్: రెసిడెంట్ కమిషనర్ పీఎస్, వందన- 9871999044, హెల్ప్ లైన్: పీఆర్ ఓ చక్రవర్తి నంబర్- 9949351270. హెల్ప్ లైన్: లైజన్ ఆఫీసర్ జీ. రక్షిత్ నాయక్ నంబర్- 9618597969.. అలాగే నేపాల్ లో వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల సహాయం కోసం సచివాలయంలోని GAD-NRI ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను అందుబాటులోకి తెచ్చింది. బాధితుల సమాచారం కోసం ఎస్. లక్ష్మీనారాయణ (అసిస్టెంట్ సెక్రటరీ): 9885371189.. కే. శ్రీనివాస్ రెడ్డి (సెక్షన్ ఆఫీసర్): 7997959754.. ఈ చిట్టిబాబు (సెక్షన్ ఆఫీసర్): 9440854433 నెంబర్లను అందుబాటులో ఉంచింది.












Click it and Unblock the Notifications