ఏపీకి పెట్టుబడుల ప్రవాహం - ఒక్క రోజులో ఏకంగా రూ 11.85 లక్షల కోట్లు..!!

విశాఖ కేంద్రంగా సాగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది.

అడ్వాంటేజ్ ఏపీ. విశాఖ కేంద్రంగా సాగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం 340 సంస్థలు.. 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. అందులో భాగంగా తొలి రోజున 92 ఎంవోయూల ద్వారా 11.85 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి దక్కాయి. మిగిలిన 248 ఎంవోయూలను రేపు (4వ తేదీ) రెండో రోజు సదస్సులో రూ. 1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరగునన్నాయి.

తొలి రోజు సదస్సులో భారీగా

తొలి రోజు సదస్సులో భారీగా


ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023 తొలి రోజు సక్సెస్ అయింది. తొలి రోజు ఒప్పందాల్లో భాగంగా 3.92 లక్షల మందికి ఉపాధి లభించింది. ప్రధానంగా ఇంధన రంగంలో 8.25 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. 35 ఒప్పందాలు ఈ ఒక్క రంగంలోనే కుదిరాయి. దీని ద్వారా ఈ రంగంలో పెట్టుబడులతో 1.33 లక్షల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా వేసారు. అదే విధంగా .. పరిశ్రమలు- వాణిజ్య రంగంలో 41 ఎంఓయూల ద్వారా 3.20 లక్షల కోట్లకు సంబంధించి ఎంఓయూలు జరిగాయి. దీని ద్వారా 1.79 లక్షల మందికి ఉపాధి దక్కనుంది. ఐటీ పరిశ్రమల్లో 6 ప్రతిపాదనలు వచ్చాయి. దీని ద్వారా 32,944 కోట్ల పెట్టుబడులు..3.20 లక్షల మందికి ఉపాధి దక్కనుంది.

ఎనర్జీ- టూరిజం రంగాల్లో పెట్టుబడులు

ఎనర్జీ- టూరిజం రంగాల్లో పెట్టుబడులు


పర్యాటక రంగంలో 10 ప్రతిపాదలు రాగా..రూ 8,718 కోట్ల మేర ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా 13,400 మందికి ఉపాధి లభించనుంది. ప్రధానంగా ఎన్టీపీసీ రూ 2,35,000 కోట్ల పెట్టుబడితో మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ద్వారా 77,000 మందికి ఉపాధి లభిస్తుంది. జేఎస్ డబ్ల్యూ గ్రూపు ఆరు అవగాహన ఒప్పందాలను ఖరారు చేసింది. మొత్తం 50,632 కోట్లు పెట్టుబడితో 9,500 మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందం ఖరారైంది. అరబిందో గ్రూప్ 10,365 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది, దీని ద్వారా 5,250 మందికి ఉపాధి లభిస్తుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ 21,820 కోట్ల రూపాయల పెట్టుబడితో రూ 14,000 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.

రెండో రోజు కొనసాగుతున్న ఎంఓయూలు

రెండో రోజు కొనసాగుతున్న ఎంఓయూలు

ఆదిత్య బిర్లా గ్రూప్ రూ 9,300 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది, దీని ద్వారా రూ 2,850 మందికి ఉపాధి లభిస్తుంది. జిందాల్ స్టీల్ 2,500 మందికి ఉపాధి కల్పించే రూ 7,500 కోట్ల పెట్టుబడితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో గత మూడేళ్ల కాలంగా వచ్చిన అవార్డులను పెట్టుబడి సదస్సులో ప్రభుత్వం ప్రదర్శించింది. సదస్సు ప్రాంగణంలో 200 స్టాల్స్ ఏర్పాటు చేసారు. ఇందులో 30 స్టాల్స్‌లో13 కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను ప్రదర్శిస్తున్నారు. సదస్సులో భాగంగా పారిశ్రామిక వేత్తలో సమావేశాలు, సెమినార్లు మరియు సమావేశాలు వంటి విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో పాటుగా చైనా, యూఎస్ ఏ సహా 40 ఇతర దేశాల నుండి 8,000 మంది ప్రముఖులు మరియు పెట్టుబడిదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రేపు రెండో రోజు సదస్సులో మరిన్ని పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు జరగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+