బడ్జెట్ లో 'తల్లికి వందనం'కు నిధులు - రైతులకు భారీ కేటాయింపులు..!!

AP Budget 2025-26: ఏపీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఎన్నికల హామీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు చేసి నట్లు సమాచారం. అందులో భాగంగా తల్లికి వందనం..అన్నదాత సుఖీభవ పథకాలను భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన బడ్జెట్ లో ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. దీంతో, ఈ పథకాలకు బడ్జెట్ కేటాయింపుల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

పథకాలకు ప్రాధాన్యత
కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రవేశ పెట్టేందుకు సమాయత్తం అయింది. 2025-26 వార్షిక బడ్జెట్ నేడు ప్రజల ముందుకు రానుంది. బడ్జెట్ లో సంక్షేమం - అభివృద్ధి కి ప్రాధా న్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ పథకాలకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్న ట్లు సమాచారం. అధికారులు ప్రతిపాదించిన లెక్కల ఆధా రంగా కేటాయింపులు చేసినట్లు తెలు స్తోంది. రూ 3.25 లక్షల కోట్లతో ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతి పాదించనున్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ తల్లికి ఏడాదికి రూ 15 వేలు ఇవ్వాల్సి ఉంది.

AP Govt to allocate funds for Super Six schemes in Budget 2025-26 details here

తల్లికి వందనం నిధులు
తల్లికి వందనం పథకం అమలు కోసం తాజా లెక్కల మేరకు 69.16 లక్షల మంది అర్హు లుగా గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేలు చొప్పున ఆర్ధిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సుమారు రూ.10,300కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం పైన ప్రకటన చేసారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు రూ 20 వేలు ఇవ్వాల్సి ఉంది. రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా అధి కారులు తేల్చారు. ఒక్కో రైతుకు రూ 20 వేలు చొప్పున చెల్లించేందుకు కావాల్సిన మొత్తం రూ 10,717 కోట్లు అవసరమని లెక్క వేసారు.

రైతుల కోసం
పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహా యించటం ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ 14 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇందు కోసం కావాల్సిన మొత్తం 7,502 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఇక, రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ లో రైతుల కోసం భారీగా కేటాయింపులు ఉంటాయని అంచనా. దీంతో.. మొత్తంగా ఈ సారి బడ్జెట్ కేటాయింపుల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+