వాలంటీర్ల పై ఫైనల్ నిర్ణయం - కొత్త రేషన్ కార్డులు వీరికే..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీల పైన కూటమి సర్కార్ ఫోకస్ చేసింది. దీపావళి నుంచి ప్రారంభించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మార్గదర్శకాల ను నేటి మంత్రివర్గ భేటీలో ఖరారు చేయనున్నారు. అదే విధంగా వాలంటీర్ల కొనసాగింపు, జీతాల పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానా పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. ఈ భేటీలో కీలకమైన వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.

ఆమోద ముద్ర
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పథకాలతో పాటుగా కొత్త పాలసీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నెల 31వ తేదీ నుంచి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనున్నారు.

AP Govt to finalise the guide lines for new ration cards and decision on volunteers

వాలంటీర్ల పై నిర్ణయం
గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25 సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851గా ఉంది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు. అదే ఐదేళ్ళకు కలిపి రూ.13వేల 423 కోట్ల అదనపు భారంగా లెక్కలు తేల్చారు. ఇక, వాలంటీర్ల కొనసాగింపుతో పాటుగా వేతనాల చెల్లింపు పైనా మంత్రివర్గం లో తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. వాలంటీర్లను ఏ సంఖ్యలో వినియోగించుకోవాలి .. ఏ విధులు అప్పగించాలనేది చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

అర్హతల ఖరారు
ఇక, కొత్త రేషన్ కార్డుల పైన అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దాదాపు ఏడాది కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కార్డుల జారీ పైన అధికారుల నివేదిక పైన మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోవటంతో పాటుగా అనర్హులకు కార్డుల తొలిగింపు అంశం మంత్రివర్గ ఉప సంఘం చేసే సిఫార్సులకు అనుగుణంగా తీసుకోనుంది. ఇసుక, లిక్కర్ పాలసీ అమలు పైన మంత్రివర్గం సమీక్షించనుంది. ఇక.. సాగునీటి సంఘాల ఎన్నికల పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+