ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు - ఇక నుంచి నగదు ఇలా..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ సంక్షేమ పథ కాల అమల వేగం పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త నిర్ణయాల అమలుకు సిద్దం అయింది. అందులో భాగంగా ఇప్పటికే అమల్లో ఉన్న ఉచిత వంట గ్యాస్ పథకం లో కీలక మార్పులు చేయా లని డిసైడ్ అయ్యారు. లబ్ది దారులకు అందించే నగదు చెల్లింపుల్లో కొత్త విధానం అందుబాటులో కి రానుంది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వుల జారీకి తుది కసరత్తు కొనసాగుతోంది.
కీలక మార్పులు
ఏపీలో 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా కూటమి నేతలు కసరత్తు వేగవంతం చేసారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ పథకాల అమలుకు ఇక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే లోగానే అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఈ సారి అమలు చేసే పీఎం కిసాన్ పథకంతో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతు ల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నారు. ఇక.. ఇప్పటికే అమలు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం లో మార్పులు చేస్తున్నారు.

ముందుగానే నగదు
ప్రతీ ఏటా అర్హులైన లబ్ది దారులకు మూడు సిలిండర్ల వరకు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు ఈ విధానంలో మార్పులకు నిర్ణయించారు. ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేసి లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ చేయాల ని తాజాగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. దీపం పథకానికి సంబంధించి మూడు సిలిండర్ల నగదుని లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీలో ఉచిత సిలెండర్ల పథకం అమలుకు ఏటా రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదిలో అర్హత కలిగిన లబ్దిదారుకి మూడు సిలిండర్ల ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు తొలుత సిలిండర్ తీసుకునే సమయంలో లబ్ది దారులు నగదు చెల్లించాల్సి వస్తోంది. ఆ తరువాత వారి ఖాతాల్లో ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది.












Click it and Unblock the Notifications