మహిళలకు జగన్ గుడ్ న్యూస్ - ఒకేసారి రెండు పథకాల నిధుల జమ..!!
ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రతిపక్షాలు పొత్తులతో వచ్చినా ప్రజల మద్దతు తమకే ఉంటుందని జగన్ ధీమాగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తన గెలుపు అస్త్రంగా జగన్ మలచుకుంటున్నారు. ఇక..ముందుగానే ఎన్నికలు వస్తాయనే అంచనాల వేళ సంక్షేమ పథకాల పై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎన్నికల కార్యచరణ : ఏపీలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సీఎం జగన్ అలర్ట్ చేసారు. మంత్రులకు కీలక సూచనలు చేసారు. ఫిబ్రవరి నాటికి అన్ని పనులు పూర్తి కావాలని స్పష్టం చేసారు. ఇప్పటికే అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు వేగవంతం చేసారు. జనవరి నెల ఎన్నికలకు కీలకంగా భావిస్తున్నారు. దీంతో..జనవరి నెలలోనే సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయించారు. 2019 ఎన్నికల సమయంలో ఇఛ్చిన హామీ మేరకు ప్రతీ ఏటా రూ 250 చొప్పున పెంచుతూ వచ్చే నెల జనవరి నుంచి మూడు వేల రూపాయాలకు పెన్షన్ అమలుకు నిర్ణయించారు. రాష్ట్రంలోని 66 లక్షల మందికి పెరిగిన పెన్షన్ వచ్చే నెల నుంచి రూ 3 వేల చొప్పున అందనుంది. ఇదే సమయంలో మరో రెండు సంక్షేమ పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు.

పథకాల నిధులు విడుదల : జనవరి నెలలో మహిళల ఖాతాల్లో పథకాల నిధులు వరుసగా జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా వైఎస్సార్ ఆసరా పథకం నాలుగో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆసరా పథకం ద్వారా 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది మహిళల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది. అదే విధంగా వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేసేలా నిర్ణయించారు. 45 ఏళ్లు నిండిన తర్వాత అర్హులైన మహిళలకు ఈ పథకం అమలు కానుంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా వార్డు - గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించనున్నారు.

పథకాలతో ప్రజల్లోకి : అదే సమయంలో పథకాలకు అర్హత ఉండి..అందని వారు ఎవరైనా ఉంటే వారిని జాబితాలో చేర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూనే జనవరి నెలలో పెన్షన్ పెంపు..వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ భరోసా నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్దం చేసారు. ఈ లోగా అభ్యర్దుల ఎంపిక పైన కసరత్తు పూర్తి చేసి..ఈ పథకాల విడుదల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకే సారి నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు ఈ పథకాల నిధుల విడదల సమయంలో ప్రజలతో మమేకం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో..జనవరి నెలలో భారీ స్థాయిలో మహిళల ఖాతాల్లో ఈ రెండు పథకాల నిధుల జమ కానున్నాయి. దీని ద్వారా మహిళల ఖాతాల్లో నిధులతో నిండుతాయని మంత్రులు చెబుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications