సైబర్ నేరాల నియంత్రణకు కమాండో వ్యవస్థ..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల నియంత్రణకు కొత్త వ్యవస్థను సిద్దం చేసింది. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోం మంత్రి అనిత చెప్పారు. అందులో భాగంగా అపరిచితుల నుంచి మన ఫోన్లకు వచ్చే మెసేజ్, మెయిల్స్, వాట్సప్ మెసేజ్‌లకు స్పందించవద్దని, లోన్ యాప్, లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

సైబర్ క్రైమ్ నిరోధానికి
విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్‌ నిర్వమించారు. రోజురోజుకూ సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అనిత అన్నారు. ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు. టెక్నాలజీ పెరిగిన తరువాత నేరాలు పెరిగాయన్నారు. టెక్నాలజీ వల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని అనిత పేర్కొన్నారు.

AP Govt to introduce command system to control Cyber crimes in the state

ప్రత్యేక వ్యవస్థ
సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది సైబర్ కమాండోలు, 2000 మందికి సైబర్ సోల్జర్స్ శిక్షణ ఇచ్చి నగర పోలీసులు నియమించారు. టెక్నాలజీ పెరిగిన తరువాత నేరాలు పెరిగాయన్నారు. టెక్నాలజీ వల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని అనిత పేర్కొన్నారు. దేశంలో 1700 కోట్లు 4 నెలల్లో సైబర్ నేరాల వల్ల పోగొట్టుకున్నారని తెలిపారు. చదువుకున్న వాళ్ళే సైబర్ నేరాలకు బలి అవుతున్నారన్నారు. ఫేస్ బుక్ లేదు అంటే ఆశ్చర్య పోతున్నారన్నారు. ఒక్క క్లిక్ తో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు.

AP Govt to introduce command system to control Cyber crimes in the state

ప్రభుత్వ తాజా నిర్ణయం
చిన్న చిన్న పిల్లలు సైబర్ నేరాలకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని అనిత చెప్పుకొచ్చారు. 50 లక్షల లోన్ ఇస్తానని తనకు కూడా మెసేజ్ చేశారన్నారు. లోన్ యాప్స్ వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా సైబర్ నేరగాళ్లకు బలైన వాళ్ళేనని హోంమంత్రి అనిత అన్నారు. స్టేట్ సైబర్ సెల్ కో ఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామన్నారు. మన భవిష్యత్ మన చేతిలో ఉందని.. కేస్ పెడతా అని బెదిరించగానే.. అసలు ఎందుకు తమపై కేస్ పెడుతున్నారు అని ప్రశ్నించడం లేదని వంగలపూడి అనిత అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+