పుష్కరాలు: కేసీఆర్‌కు బాబు సర్కార్ ఆహ్వానం, అప్పుడే వచ్చాయట!
రాజమండ్రి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాజమండ్రిలో జరిగే గోదావరి పుష్కరాలకు అతిథిగా రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించే అవకాశముంది. ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు మాట్లాడారు.
కేసీఆర్ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పీఠాధిపతులు, మత పెద్దలు, ఆధ్యాత్మిక గురువులను గోదావరి పుష్కరాలకు ఆహ్వానిస్తామని చెప్పారు. రెండువేల ఐదు వందల మందికి పైగా ఆహ్వానాలు పంపిస్తామని ఆయన చెప్పారు.

జూలై 1 నుంచి గోదావరికి అఖండ హారతిని ఇవ్వడం ప్రారంభిస్తామన్నారు. మొత్తం 20వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. పుష్కర ఘాట్లను వీవీఐపీ, వీఐపీ, సాధారణ ఘాట్లుగా విభజిస్తామన్నారు.
గోదావరి పుష్కరాలు వచ్చేశాయ్!
వచ్చే నెల 14వ తేదీన గోదావరి పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రాలు పనులు చేస్తున్నాయి. అయితే, సూర్య సిద్ధాంతం ప్రకారం నేటి నుంచే గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయని ప్రముఖ జ్యోతిష్కులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి చెప్పడం గమనార్హం. ఈ రోజు (ఆదివారం) నుంచి జూలై 9వ తేదీ వరకు పుష్కరాలు నిర్వహించాలన్నారు.












Click it and Unblock the Notifications