నియామకాలు- పోస్టుల్లో కొత్త మార్పులు, ఉద్యోగుల బదిలీల పై కీలక నిర్ణయం .. ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబం ధించి ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా గజెట్ జారీ చేయనుంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన 'ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025' గెజిట్‌కు అనుగుణంగా రూపకల్పన చేస్తున్నారు. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. తుది ఆమోద ముద్ర వేయనున్నారు.
ఏపీ లో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన 'ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్- 025' గెజిట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదలకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఏపీలోని 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీ లకు ఇదే ప్రామాణికం కానున్నాయి. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు జీఏడీ మంత్రివర్గ ఆమోదం కోసం పంపింది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేసిన తరువాత గెజిట్ జారీ కానుంది. నియామకాలు, బదీలలకు సంబంధించి ప్రస్తుతం స్థానికత, స్థానికేతర కోటా జిల్లా స్థాయి నియామకాల్లో 80:20, జోనల్ స్థాయిలో 70:30గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్నవి మల్టీజోన్ పోస్టులుగా మారనున్నాయి. అదే విధంగా నేరుగా చేపట్టనున్న అన్ని కేటగిరీ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం.. స్థానికేతరులకు 5 శాతం కోటాగా ఖరారు చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలతో కలిపి 28 జిల్లాలకు కొత్త గెజిట్ నోటిఫికేషన్ జారీ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపనున్నారు.

జోనల్ వ్యవస్థ ఖరారు.. మంత్రివర్గంలో ఆమోదం
అదే విధంగా జాబ్ కేలండర్‌లో పేర్కొన్న ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి 28 జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ వస్తే దాని ప్రకారమే నియామకాలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికే న్ జారీ చేస్తే ఇప్పటి వరకు ఉన్న పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-1975 రద్దు కానుంది. జూనియర్ అసిస్టెంట్, దీనికంటే దిగువ ఉండే పోస్టులను జిల్లా స్థాయి క్యాడర్‌గా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక.. జూనియర్ అసిస్టెంట్‌కు పైన సూపరింటెండెంట్, మొదటిస్థాయి గెజిటెడ్ పోస్టులను జోనల్ పోస్టులుగా మారతాయి. అదే విధంగా సూపరింటెండెంట్, మొదటిస్థాయి గెజిటెడ్ పోస్టు కేటగిరీకిపైన డిప్యూటీ కలెక్టర్, దీనికి సమానమైన కేటగిరీలను మల్టీ జోన్ పోస్టులుగా పరిగణిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయ పోస్టులు జిల్లా క్యాడర్‌లోనే ఉంటాయి. స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు నిర్ణయించిన విద్యార్హత నుంచి ఏడేళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో నాలుగేళ్లు చదివిన ప్రాంతాన్నే స్థానికంగా నిర్ధారిస్తారు. విద్యార్హతలు లేని పోస్టులకైతే నివాస ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక.. మల్టీ జోన్, జోన్ ల పరిధులను ఖరారు చేసారు. వీటన్నింటి గురించి కేబినెట్ లో చర్చించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications