ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! త్వరలో మరో సర్వే..!

ఏపీలో గత వైసీపీ హయాంలో ఇచ్చిన పెన్షన్లను భారీగా పెంచడంతో పాటు లబ్దిదారుల సంఖ్యను కూడా పెంచి కూటమి సర్కార్ ప్రతీ నెలా పంపిణీ చేస్తోంది. క్షేత్రస్దాయిలో పింఛన్ల పంపిణీ లో భాగంగా అనర్హుల్ని గుర్తించి ఇప్పటికే తొలగించింది. అయినా ఇంకా అనర్హులు ఉన్నారనే చర్చ జరుగుతూనే ఉంది. మరోవైపు వైఎస్సార్సీపీ అకారణంగా పెన్షన్లను తీసేస్తున్నారనే చర్చను తెరపైకి తెస్తోంది. దీంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో కూటి ప్రభుత్వం భారీగా పెన్షనర్లను జాబితా నుంచీ తొలగించిందని, చాలా మందికి పెన్షన్ ఇవ్వట్లేదనీ జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఐవీఆర్ఎస్ విధానంలో మరో సర్వే నిర్వహించేందుకు సిద్దమైంది. ఈ సర్వే లబ్దిదారుల గుర్తింపు కోసమో, తొలగింపు కోసమో కాదు. ప్రస్తుతం పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారులకు నేరుగా కాల్స్ చేసి వారిని నిర్ధారించుకోవడం, పెన్షన్లు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడం, వైసీపీ ప్రచారలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా జరగనుంది.

AP Govt to Launch IVRS Survey on Pensioners to Counter YSRCP Campaign

ఈ మేరకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ దారులకు ప్రభుత్వం నుంచి కాల్ వస్తుంది. అందులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఎలా అమలవుతోంది అనే అంశంపై 3 ప్రశ్నలు అడుగుతారు. వాటికి పెన్షన్ లబ్దిదారులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇందులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో అవినీతి ఉందా?, ప్రతి నెలా 1వ తేదీన పింఛన్ ఇంటి దగ్గరే అందుతోందా?,
పింఛన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది? వంటి మూడు ప్రశ్నల్ని అడుగుతారు. వీటిని అవును, బాగుంది అయితే 1 లేదు, బాగోలేదు అయితే 2 నొక్కమని అడుగుతుంది. వీటికి లబ్దిదారులు సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

AP Govt to Launch IVRS Survey on Pensioners to Counter YSRCP Campaign

ఈ ప్రశ్నలకు పెన్షన్ల లబ్దిదారులు ఇచ్చే సమాధానాల ఆధారంగా ప్రభుత్వం కొత్త సంవత్సరంలో పెన్షన్ పంపిణీపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే అవినీతి జరుగుతోంది అని తేలితే సచివాలయ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వట్లేదు అని తెలిస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటారు. ఈ సర్వే ద్వారా పెన్షనర్ల సంఖ్యను ప్రభుత్వం తగ్గించిందా లేదా అనేది కూడా తేలిపోనుంది. కాబట్టి ఈ సర్వేలో లబ్దిదారులు చురుగ్గా పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+