కోనసీమ ఎస్పీపై బదిలీ వేటు - కీలక జిల్లాల అధికారుల మార్పు : ఐపీఎస్ ల బదిలీ..!!
ఏపీలో కీలక జిల్లాల పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి పై బదిలీ వేటు పడింది. గత నెలలో కోనసీమలో జరిగిన అల్లర్లు..విధ్వంసం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు వెల్లువెత్తాయి. ముందుగానే నిరసనల పైన సమాచారం ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ జనసేన అధినేత పవన్ తో సహా పలువురు నేతలు ప్రశ్నించారు.
అయితే, ఆ రోజన జరిగిన రాళ్ల దాడిలో ఎస్పీ సైతం గాయపడ్డారు. ఏకంగా మంత్రి ఇంటికి నిప్పు పెట్టటం.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిని సైతం దహనం చేసేందుకు ప్రయత్నం జరిగింది.
అక్కడ కనీసం వారిని వారించేందుకు పోలీసు సిబ్బంది లేరనే విమర్శలు ఉన్నాయి. రసనలను అంచనా వేయటంలో.. కట్టడి చేయటంలో విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో..కేసు విచారణలో భాగంగా అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.

డీఐజీ పాల్ రాజ్ అమలాపురంలోనే మకాం వేసి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ అక్కడే ఉన్నారు. తాజాగా డీజీపీ అమలాపురంలో పర్యటించారు. నాటి పరిస్థితులు.. విచారణ తీరు పైన ఆరా తీసారు. ఇప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన స్థానంలో కొత్త ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు.
ఇక, కృష్ణా జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న సిద్ధార్థ కౌశల్ బదిలీ అయ్యారు. కొద్ది కలంగా కర్నూలు జిల్లాలో పరిస్థితులు సున్నితంగా మారుతున్న వేళ..అక్కడకు సిద్ధార్థ కౌశల్ ను పంపారు. కృష్ణా జిల్లా ఎస్పీగా పి జాషువా ను నియమించారు.
Recommended Video

విజయవాడ డీసీపీగా విశాల్ గున్నీ నియమితులయ్యారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత సస్పెన్షన్ కు గురైన సీనియర్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు ను అనేక మలుపుల తరువాత ఎట్టకేలకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా..అయిదురుగు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications