ఏపీలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ... ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు... ఉత్తర్వులు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది.పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు శుక్రవారం(జులై 23) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం... కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా చెవ్వూరి హరికిరణ్,కర్నూలు కలెక్టర్‌గా కోటేశ్వరరావు, విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి, విశాఖ కలెక్టర్‌గా ఎ.మల్లిఖార్జునలను నియమించింది.
పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సుమిత్ కుమార్,శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బీఆర్ అంబేడ్కర్,చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా స్వప్నిల్ దినకర్‌లను నియమించింది.
వైద్యశాఖ ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా మురళీధర్ రెడ్డి,ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా వినయ్ చంద్,ఆర్ అండ్ ఆర్ కమిషనర్‌గా హరి జవహర్ లాల్,పౌర సరఫరాల శాఖ వీసీ,ఎండీగా వీరపాండియన్,విశాఖ వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా వెంకటరమణా రెడ్డి,చేనేత శాఖ డైరెక్టర్‌గా పి.అర్జున్ రావు,దేవాదాయ ముఖ్య కార్యదర్శిగా వాణీ మోహన్,శాప్ ఎండీగా ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆక్టోపస్ ఎస్పీగా డా. కోయ ప్రవీణ్, ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్, విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్, కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా గరుడ్ సుమిత్ సునీల్, విశాఖ డీసీపీ-1గా గౌతమీ శాలి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా వకుల్ జిందాల్, మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్గా అజితా వేజెండ్ల బదిలీ అయ్యారు.
గత నెలలోనూ భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. . ఒకేసారి 20 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్న గంధం చంద్రుడును గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను మైనారిటీ సంక్షేమ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ అయ్యారు. వీరి స్థానంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా నాగలక్ష్మి, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్ నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications