వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ఇసి : ఏబి వెంక‌టేశ్వ‌ర రావు కేంద్రంగా : హైకోర్టులో నేడు కీల‌క విచార‌ణ‌..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ఎన్నిక‌ల సంఘం. ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వెంక‌టేశ్వ‌ర రావు కేంద్రంగా వివాదం కొన‌సాగుతోంది. ఇంట‌లిజెన్స్ ఎన్నిక‌ల సంఘం ప‌రిధిలోకి రాకుండా ఏపి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని పై ఎన్నిక‌ల సంఘం అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. ఇంట‌లిజెన్స్ విభాగం పోలీసు శాఖ ప‌రిధిలో ఉండ‌దా అని ప్ర‌శ్ని స్తున్న సీఈవో. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం పై నేడు ఏపి హైకోర్టులో వాద‌న‌లు ఆస‌క్తి క‌రంగా మార‌నున్నాయి.

ఎన్నిక‌ల సంఘం తో ఢీ..

ఎన్నిక‌ల సంఘం తో ఢీ..

ఎన్నిక‌ల వేళ‌..ఏపిలో ఆస‌క్తి క‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసిపి ఫిర్యాదు మేర‌కు ఇంట‌లిజెన్స్ చీఫ్ ఏబి వెంక‌టేశ్వ‌ర రావుతో స‌హా ఇద్ద‌రు ఎస్పీల పై ఎన్నిక‌ల సంఘం బదిలీ వేటు వేసింది. అయితే, తొలుత ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు ముగ్గురుని రిలీవ్ చేస్తూ ఏపి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ త‌రువాత ఏపి ప్ర‌భుత్వ ఆలోచ‌న మారింది. ఇంట‌లిజెన్స్ చీఫ్ పై బ‌దిలీ వేటును ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఆ వెంట‌నే ముందు రోజు జారీ చేసిన ఉత్త‌ర్వులను ర‌ద్దు చేసింది. డిజి నుండి కానిస్టేబుల్ దాకా అంద‌రినీ ఎన్నిక‌ల సంఘం ప‌రిధిలోకి తెస్తూ జీవో ఇచ్చిన ప్ర‌భుత్వం..ఇంట‌లిజెన్స్ ను మాత్రం మిన‌హాయించింది. ఆ త‌రువాత ఎన్నిక‌ల సంఘం ఆదేశాల ను ప‌క్క‌న పెట్టి..ఇద్ద‌రు ఎస్పీల‌ను మాత్ర‌మే రిలీవ్ చేసిన ప్రభుత్వం..ఇంట‌లిజెన్స్ చీఫ్ ను మాత్రం బ‌దిలీ చేయ‌కుం డా య‌ధావిధిగా కొన‌సాగిస్తోంది. దీని పై ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ గా ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇసి తర‌పున అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌..

ఇసి తర‌పున అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌..

ఎన్నిక‌ల సంఘ నిర్ణ‌యం పై ఏపి ప్ర‌భుత్వం నుండి సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ కార్య‌ద‌ర్శి ఎన్ శ్రీకాంత్ హైకోర్టు లో పిటీ ష‌న్ దాఖ‌లు చేసారు. ఇంట‌లిజెన్స్ విభాగం ఎన్నిక‌ల నిర్వ‌హణ ప‌రిధిలోకి రాద‌ని ఏపి ప్ర‌భుత్వం వాదిస్తోంది. దీని పై సంబంధిత ఉత్త‌ర్వుల‌ను కోర్టులో ప్ర‌వేశ పెట్టాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సం ఘం నుండి అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ వాద‌న‌లు వినిపించ‌నున్నారు. ఎన్నిక‌ల సంఘానికి ఇంట‌లిజెన్స్ చీఫ్ పై ఇచ్చిన ఫిర్యాదులు..ఆధారాల‌ను కోర్టు ముందు ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అదే విధంగా.. ఇంట‌లిజెన్స్ విభాగం అస‌లు ఎన్నిక‌ల ప‌రిధిలోకి వ‌స్తుందా రాదా అనే అంశం పై కోర్టు ఏ ర‌క‌మైన డైరెక్ష‌న్ ఇస్తుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారం పై ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది.

ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌నం : నిఘా బాస్ పై వేటు : ఇద్ద‌రు ఎస్పీల పైనా చ‌ర్య‌లు..!ఎన్నిక‌ల సంఘం సంచ‌ల‌నం : నిఘా బాస్ పై వేటు : ఇద్ద‌రు ఎస్పీల పైనా చ‌ర్య‌లు..!

ఇంట‌లిజెన్స్ ప్ర‌మేయం ఉండ‌దా..

ఇంట‌లిజెన్స్ ప్ర‌మేయం ఉండ‌దా..

ఎన్నికల సంఘం విధులకు ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధం లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై దివ్వేది తీవ్రంగా స్పందించారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ నుంచి ముందస్తు సమాచారం లేకుండా మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంత్రాల్లో శాంతి భద్రతల పరంగా ఏ విధంగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తామంటూ ఆయన ప్రశ్నించా రు. పోలీసు విధి నిర్వహణలో ఇంటెలిజెన్స్‌ ఒక భాగమని, శాంతిభద్రతలతో ముడి పడి ఉన్న ఏ అంశమైనా ఇంటెలి జెన్స్‌తోనే ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య పరిణామంతో ఇంటెలిజెన్స్‌ విభాగానికి సంబంధం ఉండదా.. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యతో సంబంధం ఉండదా అని ఆయన ప్రశ్నించారు. ఇంటె లిజెన్స్‌ నుంచి ముందస్తు సమాచారం లేకుండా సరైన అంచనా, నిఘా ఏర్పాట్లు ఎలా సాధ్యమవుతాయని ద్వివేదీ ప్ర‌శ్నించారు. ఇప్పుడు కోర్టులో జ‌ర‌గ‌బోయే వాదోప‌వాదాలు..తీర్పు పై ఆస‌క్తి నెల‌కొంది.

English summary
AP Govt vs Election commission. To day in AP High court case come to hearing on AP Govt petition against election comm ission on Intelligence chief transfer. Additional Solicitor General from Elections commission participate in court arguments. Now this issue became hot topic in elections time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X