అన్నదాత సుఖీభవ రైతులకు శుభవార్త..! 5.44 లక్షల మందికి లబ్ది..!

ఏపీలో కూటమి సర్కార్ ఈ ఏడాది తొలిసారి అన్నదాత సుఖీభవ పథకాన్ని పక్కాగా అమలు చేసింది. అయితే ఇందులోనూ పలు లోపాలు తలెత్తాయి. దీంతో భారీగా రైతులు ఈ పథకం లబ్దిదారులుగా అర్హత ఉండి కూడా నిధులు అందుకోలేకపోయారు. ఇందుకు కారణమైన ఓ అంశంలో వారికి ఊరటనిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 5.44 లక్షల మంది రైతులకు లబ్ది కలగబోతోంది.

అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన 5.44 లక్షల మంది రైతుల వెబ్ ల్యాండ్ రికార్డులు తహసీల్దార్ స్ధాయిలో సవరణల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇందులో తప్పు ఆధార్ మ్యాపింగ్, ఒకటి కంటే ఎక్కువ మంది పట్టాదారులకు ఆధార్ మ్యాపింగ్ కావడం, అసలు పట్టాదారులకు ఆధార్ లింక్ కాకపోవడం. దీంతో ఆయా రికార్డుల్ని సరిచేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది.

ap government exempts service charge for pattadar aadhar seeding in annadata sukhibhava scheme

వెబ్ ల్యాండ్ రికార్డుల్లో ఈ తప్పుల సవరణకు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కొక్కరి దగ్గర 50 రూపాయల సర్వీస్ ఛార్జీ వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం 5.44 లక్షల మంది రైతులకు కలిపి రూ.2.72 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. దీన్ని వారి నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వమే చెల్లించేలా ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకంలో ఆధార్ ఇబ్బందులతో లబ్ది పొందని వారికి ఎలాంటి రుసుము వసూలు చేయకుండానే వారి రికార్డుల్లో సవరణలు చేస్తారు.

ap government exempts service charge for pattadar aadhar seeding in annadata sukhibhava scheme

రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల కారణంగా వారికి ఈ ఏడాది "అన్నదాత సుఖీభవ" పథకం లబ్ధి ఆగిపోయింది. ఈ సదుపాయం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించబడిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది.ప్రభుత్వ ఉత్తర్వులతో ఆయా రైతుల రికార్డుల్ని ఉచితంగా సవరించి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా వారికి డబ్బులు చెల్లించేందుకు అర్హుల జాబితాలో చేరుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+