Half-Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు-ఎప్పటి నుంచి అంటే ? టైమింగ్స్ ఇవే..!
ఏపీలో వేసవి తాపం పెరుగుతోంది. దీంతో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్దులు అల్లాడుతున్నారు. మరోవైపు పరీక్షల సీజన్ కావడతో స్కూళ్లకు వెళ్లక తప్పని పరిస్దితి. దీంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు (half-day schools) నిర్వహించాని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఇవాళ ప్రకటన విడుదల చేసారు. దీని ప్రకారం రేపటి నుంచి స్కూళ్లను ఒక పూట మాత్రమే నిర్వహిస్తారు.
ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం మార్చి 16 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులకు ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ్ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఈ నిబంధనలు పాటించాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే వేసవి తాపం దృష్ట్యా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్దులకు ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనం యథావిధిగా అందుతుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.

మరోవైపు ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతున్నా..మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెల 18,19,20 తేదీల్లో కృష్ణా,గుంటూరు,బాపట్ల, ప్రకాశం, పల్నాడు, జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూల్, నంద్యాల, నెల్లూరు జిల్లా లో వర్షాలు ఉంటాయని తెలిపింది. మార్చ్ 22 తర్వాత నుంచి అకాల వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
గరికపాటి వివాదం: పద్మశ్రీతో గౌరవిస్తే, దానికి సార్థకత తెచ్చేలా సలహాలు ఇవ్వాలి కానీ అవమానిస్తారా? -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!














Click it and Unblock the Notifications